MoviesTollywood news in telugu

సాహో డైరెక్టర్ సుజిత్ ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

sahoo director sujeeth : సినిమా రంగం చిత్ర విచిత్రమైనది. టాలెంట్ ఉన్నా ఒక్కోసారి ఛాన్స్ వచ్చి కూడా చేజారిపోతుంది. ఒక్కోసారి యమబిజీ అయిపోతారు. ఇక యువ దర్శకుడు సుజిత్ కి మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయింది. దాంతో ఇప్పుడు తనదైన శైలిలో ఒక చిత్రం చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. మగధీర లాంటి భారీ సినిమా తర్వాత రాజమౌళి పక్కా ప్లాన్ తో సునీల్ హీరోగా మర్యాద రామన్న సినిమా తెరకెక్కించి అద్భుత విజయాన్ని అందుకున్నాడు.

ఇప్పుడు సుజీత్ కూడా ఇదే దారిలో వెళ్లాలని భావిస్తున్నట్లు టాక్. అయితే స్క్రిప్ట్ ప్రస్తుతానికి సిద్ధం కాలేదని.. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాడట. ఇప్పటికే ప్రభాస్‌తో సాహో మూవీ తీసిన సుజిత్ మళ్ళీ ప్రభాస్ హీరోగానే మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కూడా గుసగుసలు విన్పిస్తున్నాయి.

యువి క్రియేషన్స్ నిర్మించబోయే ఈ మూవీలో ప్రభాస్‌ను పోలీస్ ఆఫీసర్‌గా చూపించడానికి అదిరిపోయే యాక్షన్ స్క్రిప్ట్ సుజిత్ సిద్ధం చేసినట్లు వినిపిస్తోంది. లూసిఫెర్ మలయాళ రీమేక్ బాధ్యతలను మొదట్లో సుజిత్ కి చిరంజీవి అప్పగించినప్పటికీ సరిగ్గా సెట్ కాకపోవడంతో మోహన్ రాజాను డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నారు. దీంతో ఖాళీగా ఉన్న సుజిత్ సరైన సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు.