బుల్లెట్ బండెక్కి సాంగ్ పాడిన మోహన భోగరాజు గురించి తెలుసా?
Tollywood Singer Mohana Bhogaraju :జన భాషలోంచి పుట్టుకొచ్చే పాటలు జనం నోళ్ళలో నానుతాయి. అందరినోటా అవే సాంగ్స్ వినిపిస్తుంటాయి. ఇప్పుడు బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా ..సాంగ్ తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ఈ సాంగ్ బులెట్ లా దూసుకెళ్తోంది. ఎవరినోటా విన్నా ఇదే సాంగ్. తాజాగా ఓ పెళ్ళిలో తెలంగాణ మహిళా ఎమ్మెల్యే ఈ సాంగ్ కి స్టెప్పులేస్తూ,పెళ్ళివారిచేత కూడా వేయించారు.
యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ఈ సాంగ్ ని లక్ష్మణ్ రాయగా,మోహన భోగరాజు ఆలపించింది. ఎస్ కె జాజి మ్యూజిక్ అందించాడు. విశాఖకు చెందిన మోహన భోగరాజు ఇటీవల సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ మూవీలో పాడింది. ఈమె గానం టీజర్ లో మొదటి నుంచి చివరివరకూ వినిపిస్తుంది. ఈమె తల్లికి సంగీతం మీద పట్టుంది. తద్వారా ఆమెకు కూడా సంగీతంపై మక్కువ పెరిగింది. మోహన అసలు ఊరు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆమె పేరెంట్స్ హైదరాబాద్ లో స్థిరపడ్డారు.
హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన మోహన్ బిటెక్ తో పాటు ఎం ఏ కూడా చేసింది. చిన్నవయస్సులోనే అంటే 2వ తరగతి లోనే త్యాగరాజ గానసభలో జరిగిన పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకుంది. సంగీతంలో మెళుకువలు నేర్చుకుని టివి షోస్ లో పాల్గొని తన పాటలతో మెప్పించింది. జై శ్రీరామ్ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ ఆమెకు సాంగ్ పాడే ఛాన్స్ ఇచ్చాడు.
కీరవాణిని కల్సి తన సాంగ్స్ ని వినిపించగా, బాహుబలిలో మనోహరి సాంగ్ పాడే ఛాన్స్ దక్కించుకుంది. తమిళంలో బాహుబలి 2లో కూడా ఈమె పాడింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా తన పట్టుదలతో సినిమాల్లో పాడే ఛాన్స్ తెచ్చుకోవడమే కాదు, ఆమె పాటలు కీలకంగా మారాయి కూడా.