పావు స్పూన్ చాలు శరీరంలో గ్యాస్,అజీర్ణం,అసిడిటీ,మలబద్దకం సమస్యలను మాయం చేస్తుంది
Ajwain Health Benefits In Telugu : మనలో చాలా మంది గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.గ్యాస్ సమస్య వచ్చింది అంటే ఒక పట్టాన తగ్గదు ఈ సమస్య నుంచి బయట పడాలి అంటే కొన్ని ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడుతాయి గ్యాస్ సమస్య వెంటనే తగ్గాలి అంటే వాము చాలా బాగా సహాయపడుతుంది
వాము అనేది మన వంటింట్లో రెగ్యులర్ గా ఉపయోగించే దినుసు. వాము కాస్త ఘాటుగా ఉండటం వలన చాలామంది తీసుకోవడానికి ఇష్టపడరు కానీ గ్యాస్ సమస్యలు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. గ్యాస్ సమస్య వచ్చినప్పుడు పావు స్పూన్ వాము తీసుకుని నోట్లో వేసుకుని నములుతూ ఆ రసాన్ని నిదానంగా మింగాలి ఇలా చేయటం వలన గ్యాస్ నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది
ఈ గింజలు గ్యాస్ట్రిక్ విడుదలను పెంచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. అలాగే ఇంకో విధంగా కూడా తీసుకోవచ్చు ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని పోసి కాస్త వేడెక్కాక పావు స్పూన్ వాము వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు మరిగించాలి ఈ మరిగిన నీటిని వాముతో సహా వేడిగా ఉన్నప్పుడే కాఫీ,టీ తాగిన మాదిరిగా తాగాలి.
ఈ విధంగా తాగటం వల్ల గ్యాస్ తగ్గుతుంది. వాము గ్యాస్ సమస్య నుంచి బయటపడటానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే గ్యాస్ సమస్య ఉన్నప్పుడు ఉదయం సమయంలో పరగడుపున ఒక లీటర్ నీటిని తాగితే గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు సాధ్యమైనంతవరకు మందుల జోలికి వెళ్లకుండా గ్యాస్ నివారణకు వాము, మంచి నీరు చాలా బాగా సహాయపడుతుంది.