రజనీకాంత్,శ్రీదేవిలతో నటించిన స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?
Bollywood Star Hero hrithik roshan : సినిమా పరిశ్రమలో కష్టంతో పాటు పరిశ్రమించాలి. అప్పుడే విజయం వరిస్తుంది. అదృష్టం కూడా తోడైతే ఇక స్టార్ డమ్ ఖాయం. ఒకప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ సామాన్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. స్వయంకృషితో తమిళ సినిమా పరిశ్రమను ఏలుతున్నాడు. తమిళంలోనే కాదు తెలుగు, కన్నడం, హిందీ తదితర భాషల్లో కూడా ఈయన సినిమాలు విడుదలై మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. బాలీవుడ్ లో కూడా హీరోగా డైరెక్ట్ మూవీ చేసాడు.
మరోపక్క చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి, పెద్దయ్యాక హీరోయిన్ గా మారిన శ్రీదేవి తెలుగు, తమిళ, హిందీ తదితర భాషల్లో తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది. శ్రీదేవికి అభిమాన జనం కూడా ఎక్కువే. అలాంటి శ్రీదేవి, రజనీకాంత్ కల్సి నటించిన ఒకప్పటి బాలీవుడ్ మూవీ భగవాన్ దాదా. 1986లో రాకేష్ రోషన్ నిర్మించిన ఈ మూవీలో ఓ చైల్డ్ ఆర్టిస్టు కూడా నటించాడు. ఇది సూపర్ హిట్ కూడా అయింది.
అయితే అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన ఆ కుర్రాడు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో. పైగా భగవాన్ దాదా నిర్మించిన రాకేషన్ రోషన్ తనయుడు. అతనెవరో కాదు హృతిక్ రోషన్. బాలీవుడ్ లో పలు విజయవంతమైన మూవీస్ తో స్టార్ హీరోగా రాణిస్తున్న హృతిక్ చిన్నప్పుడు నటించిన రజనీ, శ్రీదేవి కాంబోలో మూవీ స్టీల్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ కుర్రాడెవరో తెలుసా అంటూ ఈ ఫోటో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.