బిగ్ బాస్ 5 తెలుగు మానస్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
Big Boss season 5 Manas real life :బుల్లితెర హిట్ షో బిగ్బాస్ తెలుగులో ఐదో సీజన్ జోరుగా నడుస్తోంది. దీనిపై విమర్శలు వస్తున్నా షో కి జనాదరణ కూడా బాగుంది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ షో లో 19 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి వచ్చారు. ఇందులో నటుడు మానస్ ఒకడు. బాల నటుడిగా కెరీర్ ఆరంభించి,సోడా గోలి సోడా, ప్రేమికుడు,గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్, కాయ్ రాజ్ కాయ్, ఝలక్ వంటి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు.
బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియళ్లతో పాటు పలు షోలు,షార్ట్ ఫిలింస్లోనూ మానస్ నటించాడు. కోయిలమ్మ సీరియల్ లో హీరోగా యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు.1991ఆగస్టు 2న ముంబయిలో జన్మించిన మానస్ తండ్రి వెంకట్రావు. తల్లి పద్మిని దేవి. తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ముంబయి, వైజాగ్, గోవా తదితర ప్రదేశాల్లో బదిలీపై వెళ్లి పనిచేసారు.మానస్ తల్లి ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరర్. దాంతో మానస్ ఇంజనీరింగ్ విద్యను భోగరాజు గంగరాజు కాలేజీలో పూర్తిచేసాడు.
యాక్టింగ్ పై మక్కువతో చైల్డ్ ఆర్టిస్టుగా మానస్ కెరీర్ స్టార్ట్ చేసాడు. బాలయ్య నటించిన నరసింహనాయుడు మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే డాన్స్ పై కూడా ఇష్టం వలన వైజాగ్ గురజాడ కళాక్షేత్ర వంటి చోట్ల డాన్స్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నాడు. ఫారిన్ లో ఎం ఎస్ చేసి వచ్చాక, టాలీవుడ్ లో సినిమాల్లో నటించాడు. అయితే పెద్దగా గుర్తింపు రాకపోవడంతో కోయిలమ్మ సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. మనసిచ్చి చూడు సీరియల్ లో కూడా నటించి మంచి ఫాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.