కొత్త అవతారం ఎత్తుతున్న రామ్ చరణ్ …డిమాండ్ మామూలుగా లేదుగా…?
Tollywood Hero Ram Charan :మెగా వారసుడిగా చిరుత మూవీతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి, డిఫరెంట్ మూవీస్ తో మెగా పవర్ స్టార్ అనిపించుకున్న రామ్ చరణ్ నటనలో,డ్యాన్స్‌లో తండ్రిని తగ్గ తనయుడిగా నిలిచాడు. మరోపక్క కొణిదల ప్రొడక్షన్స్ పెట్టి మెగాస్టార్ చిరంజీవితో వరుస సినిమాలు చేస్తున్నాడు.
యాడ్స్ లో కూడా సత్తా చాటుతున్న చెర్రీ తాజాగా మరో అవతారం ఎత్తడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్. ఇప్పటికే పూర్తయిన ఆచార్య, శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంతో తెరకెక్కబోతున్న పాన్ ఇండియా చిత్రంలో కూడా నటించబోతున్నాడు.
తాజాగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తెలుగు వెర్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్ సైన్ చేసినట్లు టాక్. రెండు ప్రకటనలతో పాటు ప్రింట్ యాడ్స్‌లో చేయడానికి 3 కోట్లు డిమాండ్ చేసాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సదరు సంస్థ కూడా ఓకే చెప్పిందట. ఆచార్య,ఆర్ఆర్ఆర్ విడుదల ఉండటంతో తమ మార్కేట్ను పెంచుకునే దిశగా చెర్రిని తమ బ్రాండ్ అంబాసిడర్ చేసుకోవాలని హాట్‌స్టార్ ప్లాన్ చేయడంతో ఏడాది నుంచి జరుపుతున్న చర్చలు కొలిక్కి వచ్చి,ఒప్పందం ఒకే అయింది.