రామ్ చరణ్ కొత్త కారు గురించి వైరల్…ఎన్ని కొట్లో…?
Ram Charan New Car :సినీ సెలబ్రిటీలు వాడే వస్తువులు,కార్లు, బైక్ ల గురించి చర్చ జరగడం కామన్. సోషల్ మీడియా వచ్చాక మరింతగా వీటి గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొన్న పెట్టుకున్న వాచీ గురించి ఓ వార్త చక్కర్లు కొట్టగా, ఇప్పుడు మరో వార్త వైరల్ గా మారింది.
లగ్జరీ కార్లు ఇష్టపడే హీరోల్లో రామ్ చరణ్ ఒకరు. ఇప్పటికే పలు కార్లు కొన్న చెర్రీ తాజాగా రెండున్నర కోట్లు పెట్టి కారు కొన్నట్లు తెలుస్తోంది. అది ‘మే బాచ్ జి ఎల్ ఎస్ 600’ మోడల్ కారు గా చెబుతున్నారు. దీన్ని దగ్గరుండి మరీ రామ్ చరణ్ డిజైన్ చేసుకున్నట్లు కూడా చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్,నాగచైతన్య,సాయిధరమ్ తేజ్ వంటి వాళ్ళు కొత్తగా మార్కెట్ లోకి వచ్చే కారుపై లుక్ వేయడమే కాదు, సొంతం చేసుకోడానికి రెడీ అవుతారు. ఇప్పుడు రామ్ చరణ్ కొన్న కారుని యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా కొన్నట్లు తెలుస్తోంది. ఆది పురూష్ మూవీలో ప్రభాస్ సరసన నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ కూడా ఇదే కారు కొన్నట్లు ఇప్పటికే వార్తలు చక్కర్లు కొట్టాయి.