పుష్ప పార్ట్ 2 లో హైలెట్స్ ఇవేనట…పక్కా ప్లాన్…?
Allu Arjun pushpa Movie :త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో గత ఏడాది అలవైకుంఠపురంలో మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తాజాగా చేస్తున్న మూవీ పుష్ప. గతంలో ఆర్య మూవీతో హిట్ ఇచ్చిన సుకుమార్ దీనికి డైరెక్టర్. రామ్ చరణ్ తో రంగస్థలం మూవీ తీసి బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్ ఇప్పుడు అల్లు అర్జున్ తో పాన్ ఇండియా మూవీగా పుష్ప తీస్తున్నాడు.
శరవేగంగా పుష్ప షూటింగ్ సాగుతుంటే మరోవైపు పుష్ప 2 అదే రెండవ భాగం గురించి వార్తలు చక్కర్లు కొడుతూ వస్తున్నాయి. పుష్ప వన్ పూర్తయిందని, ఇక పుష్ప 2లో సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట.ఎర్రచందనం స్మగ్లర్ గా బన్నీ నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికీ భారీ అంచనాలు వచ్చాయి.
సరిలేరు నీకెవ్వరు మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న పుష్పలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలనిజం పండించబోతున్నాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కనుక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊచించవచ్చు. ఇక పుష్ప 2 లో సిస్టర్ సెంటిమెంట్ పెట్టి, సిస్టర్ పాత్రకోసం ఓ బ్యూటీని సెలెక్ట్ చేయాలని భావిస్తున్నట్టు టాక్.