MoviesTollywood news in telugu

బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ ఇప్పుడు ఏమి చేస్తున్నాడో…?

Bigg Boss Winner abhijeet : బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-4 షో లో పాల్గొని, విజేతగా నిల్చి,ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న అభిజిత్‌ ఈ షో తర్వాత పెద్దగా కన్పించడం లేదు. తాజాగా ట్విట్టర్‌లో’ఆస్క్‌ మి ఎనీథింగ్‌’ అనే సెషన్‌ నిర్వహించిన అభిజిత్‌కు ఫ్యాన్స్‌ నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. దాంతో అతడి నుంచి షాక్ లాంటి వార్త విన్పించింది. నిజానికి యితడు బిగ్ బాస్ హౌస్ కి రాకముందే సినిమాల్లో చేసాడు.’లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఇక బిగ్ బాస్ షోలో మిగతా కంటెస్టెంట్లకు భిన్నంగా యితడు గేమ్స్ ఆడాడు. ముఖ్యంగా బుద్ది బలంతో అభిజిత్ గేమ్‌ ఆడడం ఆడియన్స్ ని ఆకట్టుకుంది. దాంతో ఎంతోమంది అమ్మాయిల మనసు దోచిన అభిజిత్‌ బిగ్‌బాస్‌ సీజన్‌-4 విజేత అయ్యాడు. ఈ షో తర్వాత ఇక సోహైల్‌,అఖిల్‌, అరియానా సహా పలువురు కంటెస్టెంట్లు వరుస ఆఫర్లతో ఫుల్‌ బిజీగా మారితే,సీజన్‌ విన్నర్‌గా నిలిచిన అభిజిత్‌ మాత్రం బాగా స్లో అయ్యాడు.

బర్త్‌డే, ప్రైవేట్‌ పార్టీల్లో మిగతా వాళ్ళలా అభిజిత్‌ పెద్దగా కనపడలేదు. ఆ మధ్య మూడు ప్రాజెక్టులకు సైన్‌ చేసినట్లు చెప్పిన అభిజిత్‌ ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. తాజాగా ఇచ్చిన ట్వీట్ తో సినిమా అప్‌డేట్‌ గురించి ఫాన్స్ ప్రశ్నలతో ముంచెత్తారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగోలేదని, అందుకే సినిమాలు చేయట్లేదంటూ తన సమాధానంతో ఫాన్స్ ఉలిక్కిపడ్డారు. ఆరోగ్యమే తనకు ముఖ్యం అన్నాడే గానీ,ఎలాంటి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడో వెల్లడించలేదు. దీంతో క్లారిటీ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.