బంగాళదుంప తొక్కలు పాడేస్తున్నారా… ఈ విషయాలు తెలిస్తే అస్సలు పాడేయరు
potato Peel Benefits In telugu : మనలో చాలామంది బంగాళదుంప అంటే చాలా ఇష్టపడతారు. బంగాళదుంపతో వేపుళ్ళు ,కూరలు, మసాలా వంటకాలు చేసుకుంటూ ఉంటారు. అయితే బంగాళదుంపను ఉపయోగించినప్పుడు పై తొక్క తీసి పాడేస్తూ ఉంటారు. అయితే ఆ తొక్కలో కూడా ఎన్నో ఔషధగుణాలు పోషక విలువలు ఉన్నాయి.
వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. బంగాళదుంప తొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ ని నాశనం చేస్తాయి. అలాగే పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి రక్త ప్రవాహం బాగా జరిగేలా చేసి గుండె సమస్యలు లేకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
యాంటి మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వలన బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. బంగాళదుంప తొక్కలను పేస్టుగా చేసి గాయాలు,పుండ్ల పై రాస్తూ ఉంటే అవి త్వరగా మానుతాయి. ఈ తొక్కలో విటమిన్స్., మినరల్స్ సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గించి ఫిట్ గా ఉండేలా చేస్తుంది
ఈ తొక్కలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. రక్తహీనత సమస్య ఉందంటే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చేస్తుంది. దాంతో శరీరంలో ఎటువంటి ఇన్ఫెక్షన్లు రావు. అంతేకాకుండా బంగాళాదుంప తొక్క ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అలాగే తెల్లజుట్టు నల్లగా మారటానికి కూడా సహాయపడుతుంది. బంగాళాదుంప తొక్కలో ఉన్న పోషకాలు చుండ్రు సమస్యను తగ్గించటమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. కాబట్టి బంగాళాదుంప వాడినప్పుడు తొక్క పాడేయకుండా ఉపయోగించండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.