కరోనా వేళ సైతం ఎంట్రీ ఇచ్చి రాణించిన హీరోయిన్స్…ఎంత మంది…?
Tollywood Heroines 2020 :కరోనా కారణంగా అన్ని రంగాలు మూతబడి, కొన్ని రంగాలు ఇంకా ఇప్పటికీ కోలుకోలేదు. థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. దాంతో పెద్ద సినిమాలు సైతం ఓటిటి లో రిలీజ్ చేస్తున్నారు. కొందరు నటులకు ఆదరణ లేకుండా పోయింది. అయితే ఈ కరోనా వేళ సైతం ఇండస్ట్రీకి వచ్చి ఓటిటి లో సత్తా చాటారు. అదృష్టం కల్సి వచ్చిన అలాంటి హీరోయిన్స్ ఎవరో పరిశీలిద్దాం.
సుమంత్ హీరోగా వచ్చిన మళ్ళీ రావా మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రీతి అస్రాని కరోనావేళ ప్రెజర్ కుక్కర్ మూవీలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. మిడిల్ క్లాస్ మెలోడీ, జాను మూవీస్ లో నటించిన వర్ష బొల్లమ్మ తాజాగా తెలుగులో మరో సినిమాలో ఛాన్స్ సంపాదించింది. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య మూవీతో ఎంట్రీ ఇచ్చిన రూపా కొడువారి తొలిమూవీతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
కృష్ణ అండ్ లీల, భానుమతి రామకృష్ణ మూవీస్ తో వర్ణికట్టి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. దృశ్యంలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఎస్తేర్ అనీల్ పెద్దవ్వడంతో జోహార్ మూవీతో హీరోయిన్ అయింది. నందు హీరోగా వచ్చిన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక శర్మ తాజాగా రెండు సినిమాల్లో చేస్తోంది. రామ్ గోపాల్ వర్మ మూవీ ఉల్లాలా ఉల్లాలా ద్వారా ఎంట్రీ ఇచ్చిన అప్సర రాణి ప్రస్తుతం పలు మూవీస్ లో ఐటెం సాంగ్స్ చేస్తోంది.