టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన అన్నదమ్ములు ఎంత మందో…?
Tollywood Brothers :సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందిన అన్నదమ్ములు కొందరు ఉన్నారు. అలాంటి వారిలో ముందుగా సూపర్ స్టార్ కృష్ణ తనయుడు రమేష్ బాబు. మొదట్లో కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి.ఆ తర్వాత మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ అయ్యాడు. అయితే కృష్ణ, రమేష్ బాబు, మహేష్ బాబు కల్సి నటించిన సినిమాలు కూడా ఉన్నాయి.
ఎన్టీఆర్ తనయులు హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా చేసారు. ఇందులో బాలయ్య స్టార్ హీరోగా ఉండగా, హరికృష్ణ తక్కువ సినిమాలు చేసినా ఆకట్టుకుని ఈ లోకం నుంచి నిష్క్రమించారు. మెగాస్టార్ చిరంజీవి,నాగబాబు,పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురూ హీరోలుగా చేసినా, చిరు,పవన్ నిలదొక్కున్నారు. నాగబాబు క్యారెక్టర్ యాక్టర్ గా మిగిలారు.
అలాగే హరికృష్ణ కుమారులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ తమ స్థాయిలో హీరోలుగా చేస్తున్నారు. అక్కినేని వారసులుగా నాగచైతన్య,అఖిల్ సినిమాలు చేస్తూ ఫాన్స్ ని అలరిస్తున్నారు. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో సూర్య, కార్తీ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు.
ఈవీవీ సత్యనారాయణ తనయులు అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి, తమకు తగ్గ సినిమాలు చేసారు. అయితే అల్లరి నరేష్ స్టార్ డమ్ తెచ్చుకోగా ఆర్యన్ అడపాదడపా మూవీస్ చేస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్నారు.
అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇద్దరూ హీరోలే. అయితే బన్నీ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ,రఘు ఇద్దరూ బ్రదర్స్. రవితేజా స్టార్ హీరోగా ఉండగా, రఘు మాత్రం కొన్ని మూవీస్ లో హీరోగా చేసాడు. విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ఇద్దరూ సినిమాలు చేస్తున్నారు. విజయ్ మంచి ఫార్మ్ లో ఉన్నాడు.
ఇక మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ హీరోలుగా సత్తా చాటారు. ఇద్దరికీ స్టార్ డమ్ వచ్చింది. స్టార్ కమెడియన్ అలీ కమెడియన్ గా, హీరోగా చేసాడు. అయితే అతడి తమ్ముడు ఖయ్యుమ్ కొన్ని సినిమాలు చేసినా తర్వాత ఛాన్స్ లు తగ్గాయి. కోలీవుడ్ లో రంగం మూవీతో జీవా వచ్చి, తెలుగులో కూడా హిట్ అందుకున్నాడు. అతడి సోదరుడు జితన్ రమేష్ ఒకటే లైఫ్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు.