రాజా ది గ్రేట్ సినిమాకు పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి…?
Ravi Teja Raja The Great Movie :వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న మాస్ మహారాజు రవితేజ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో 2017అక్టోబర్ 18న వచ్చిన రాజా ది గ్రేట్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఆత్మ విశ్వాసం మెండుగా ఉన్న ఆంధ యువకుడిగా రవితేజ నటన సూపర్భ్. సాయి కార్తీక్ మంచి సాంగ్స్ అందించగా, కామెడీ, ఎమోషన్ తో తెరకెక్కిన ఈ మూవీ లో మెహరీన్ హీరోయిన్ గా అందం, అభినయంతో ఆకట్టుకుంది.
దీనికి ఐదు రోజుల ముందు అక్టోబర్ 13న కింగ్ నాగార్జున నటించిన రాజుగారి గది 2 రిలీజయింది. సమంత ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీకి ఓంకార్ డైరెక్టర్. ఈ మూవీ ఏవరేజ్ గా నిల్చింది. థమన్ మ్యూజిక్ అందించాడు.అదేరోజు డైరెక్టర్ జోగిరాజు మమిడి డైరెక్షన్ లో యువర్స్ లివింగ్ల్లీ మూవీ రిలీజయింది. పృథ్వి అనే కొత్త కుర్రాడు, సౌమ్య అనే హీరోయిన్ తో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ ప్లాప్ గా నిల్చింది.
పి సునీల్ కుమార్ డైరెక్షన్ లో గల్ఫ్ మూవీ కూడా అప్పుడే రిలీజయింది. పోసాని కృష్ణ మురళీ ప్రముఖ పాత్ర పోషించాడు. చేతన హీరోయిన్. ఈ మూవీ కూడా నిరాశపరిచింది. అక్టోబర్ 6న వచ్చిన ఓయ్ నిన్నే మూవీ మార్గాని భరత్ హీరోగా రిలీజయింది. సత్యం డైరెక్ట్ చేసిన ఈ మూవీ పరాజయం పాలయింది.
ఇదే రోజు నేను కిడ్నాప్ అయ్యాను మూవీ రిలీజయింది. ఇదీ ప్లాప్ అయింది. అక్టోబర్ 6న వచ్చిన బావమరదళ్ళు మూవీ కి గంగరపు రమేష్ డైరెక్టర్. ఇది కూడా నిరాశ పరిచింది.అదే రోజు రిలీజైన లావణ్య విత్ లవ్ బాయ్స్ మూవీ కూడా పరాజయం పాలయింది. ఇక అక్టోబర్27న ఉన్నది ఒక్కటే జిందగీ మూవీ రిలీజయింది. రామ్, అనుపమ పరమేశ్వరన్,లావణ్య త్రిపాఠి నటించిన ఈ మూవీ ని కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసాడు. మొదట్లో మంచి కలెక్షన్స్ వచ్చినా చివరిగా ఏవరేజ్ అయింది.
అనగనగా ఒక దుర్గ అక్టోబర్ 27న వచ్చింది. ప్రకాష్ గురజాల డైరెక్టర్. ప్రియాంక నాయుడు మెయిన్ రోల్. అయితే ప్లాప్ గా నిల్చింది. ఇదే రోజు వచ్చిన దేవుడా మూవీ కూడా పరాజయం చెందింది. ఇక నవంబర్ 3న డాక్టర్ రాజశేఖర్ హీరోగా వచ్చిన గరుడ వేగ మూవీ ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిచ్చారు. పూజా కుమారి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఘనవిజయాన్ని అందుకుంది. సాయికుమార్ తనయుడు అది హీరోగా నెక్స్ట్ నువ్వే , అలాగే ఫలని డైరెక్ట్ చేసిన ఏంజిల్ మూవీస్ పరాజయం పొందాయి.