బిగ్ బాస్ దేవి నాగవల్లి కొత్త కారు ధర ఎంతో తెలుసా?
Bigg Boss Telugu Devi nagavalli bought new skoda Car :స్టార్ మాలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఎన్ని విమర్శలు ఎదురవుతున్నాయో, టీఆర్పీ రేటింగ్ కూడా అదే రేంజ్ లో ఉంది. సీజన్ 5 ప్రారంభ మయ్యాక కూడా బిగ్ బాస్ ని బాన్ చేయాలని ఇటీవల సీపీఐ నేత నారాయణ గట్టిగా డిమాండ్ చేసారు. అయినా ఈ షోకి డిమాండ్ పెరిగిపోతోంది.
ఇక గతంలో బిగ్ బాస్ లో పాల్గొన్న న్యూస్ రీడర్ దేవి నాగవల్లి గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. తాజాగా ఆమె స్కోడా కంపెనీ కారు కొన్నట్టు తెలియజేస్తూ, కారు పక్కన నించున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిజానికి బిగ్ బాస్ ముందు తర్వాత అన్నట్లు ఈమె సీన్ మారింది.
బిగ్ బాస్ లో పాల్గొన్నట్లు చెప్పుకోడానికి దేవి నాగవల్లి పెద్దగా ఇష్టపడడంలేదని తెలుస్తున్నా, ఆమె మాత్రం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవాళ్ళతో సంబంధాలు కొనసాగిస్తోంది. ముఖ్యంగా అరియనా తో క్లోజ్ రిలేషన్ లో ఉంది. అందుకే ఇద్దరూ కల్సి ఓ షార్ట్ ఫిలిం లో నటించారు. కాగా ఆమె కొన్న కారు రేటు గురించి ఆరా తీస్తే అక్షరాలా 25 లక్షల రూపాయలకు పైనే ఉంటుందని సమాచారం.