శ్రీహరి తీరని కోరికలు ఎన్ని ఉన్నాయో తెలుసా…అసలు నమ్మలేరు
Tollywood Hero Srihari :రియల్ హీరో శ్రీహరి 1986లో స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టి, ఆ తరువాత నటుడుగా తన కెరియర్ ప్రారంభించి, దాదాపు 900 చిత్రాల్లో నటించి రియల్ స్టార్‌గా నిలిచాడు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ప్రత్యేక డైలాగ్ డెలివరీతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. హీరోగా, నిర్మాతగా కూడా తన టాలెంట్ చాటాడు.
1964 ఆగస్టు 15న శ్రీకాకుళం జిల్లాలో పుట్టిన శ్రీహరి యుక్తవయసు నుండే శారీరక ధారుడ్యంపై ఆసక్తిని పెంచుకుని,అనేక పోటీల్లో పాల్లొనడంతో పాటు ‘మిస్టర్ హైదరాబాద్’గా ఏడుసార్లు అవార్డు సొంతం చేసుకున్నాడు. 2సార్లు జాతీయస్థాయి పోటీలలో పాల్గొని, బహుమతులు గెలుచుకున్నాడు.
జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర చాంపియన్ అయిన శ్రీహరి మంచి అథ్లెట్ అవ్వాలనుకున్నారట. నిజానికి జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ నటనపై మక్కువతో సినిమాలవైపు అడుగులు వేయడంతో ఏషియన్ గేమ్స్ లో భారతదేశం తరపున ఆడాలనే కోరిక అలాగే ఉండిపోయింది. అలాగే పాలిటిక్స్ పట్ల అసక్తితో రాజకీయాల్లోకి ఎంటర్ కావాలనీ, తద్వారా నలుగురికీ సహాయం చేయాలని అనుకునేవారట.
పృధ్వీపుత్రుడు, పోలీస్,గణపతి, ఆయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతు, విజయరామరాజు ఇలా దాదాపు 28 చిత్రాల్లో హీరోగా రాణించడంతో పాటు బావగారు బావున్నారా, వీడెవండిబాబూ, తాజ్ మహల్, ఢీ, కింగ్, డాన్ శీను, బృందావనం సినిమాల్లో ఆయన నటన తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు, 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో చెల్లెలి కోసం ఆరాటపడే అన్నగా తన నటనతో ఔరా అనిపించాడు. ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును అదే ఏడాదికి ఇదే చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు.
రాంచరణ్ హీరోగా తెరకెక్కిన సూపర్ డూపర్ మగధీరలో షేర్ ఖాన్ పాత్ర పెద్ద హైలెట్ గా నిల్చింది. నటి డిస్కో శాంతిని ప్రేమించి వివాహం చేసుకున్న శ్రీహరికి శశాంక్, మేఘాంశ్ అనే ఇద్దరు కుమారులున్నారు. హీరోగా రాణించానేది మేఘాంశ కోరిక. అయితే నాలుగు నెలల కుమార్తె అక్షర అకాల మరణం శ్రీహరిని మానసికంగా కృంగదీసింది. అక్షర పేరుతో ఫౌండేషన్ నెలకొల్పి, మేడ్చల్ పరిధిలోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకొని, శ్రీహరి విశేష అభివృద్ధి చేసాడు.
కాగా ప్రభుదేవా దర్శకత్వంలో రాంబో రాజ్‌కుమార్ సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్లిన శ్రీహరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించి 2013, అక్టోబరు 9న కన్నుమూయడంతో అటు శ్రీహరి కుటుంబం, ఇటు రియల్ స్టార్ ఫాన్స్ దిగ్బ్రాంతి చెందారు.