Movies

ఆది సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి…?

Ntr aadi movie : జూనియర్ ఎన్టీఆర్, వివి వినాయక్ తొలిసారి కాంబినేషన్ లో వచ్చిన ఆది మూవీ అఖండ విజయాన్ని అందుకుని బ్లాక్ బస్టర్ అయింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ తెరకెక్కించి వినాయక్ విజయాన్ని దక్కించుకుంటే, మణిశర్మ మ్యూజిక్ అదనపు ఆకర్షణ అయింది. చిన్న వయస్సులోనే భారీ హిట్ రుచిచూసిన జూనియర్ ఎన్టీఆర్ కి జోడీగా కీర్తీచావ్లా నటించింది.

2002మార్చి 28న రిలీజైన ఈ మూవీకి పోటీగా వచ్చిన సినిమాలలోకి వెళ్తే,అదేరోజు వచ్చిన నీతోడు కావాలి మూవీని భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించగా అర్జున్ బజ్వా,ఛార్మి ప్రధాన పత్రాలు పోషించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచింది.

ఆది మూవీకి ఆరు రోజుల ముందు నువ్వుంటే చాలు మూవీ రిలీజయింది. ఆదర్శ్,సోనీ నటించిన ఈ మూవీ కథ పేలవంగా ఉండడంతో పరాజయం పాలైంది. సాయికిరణ్,లయ,రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఎంత బావుందో మూవీ కూడా అదేరోజు వచ్చింది.తమ్మారెడ్డి భరద్వాజ తెరకెక్కించారు. సినిమా ప్లాపయింది. అలాగే అదేరోజు వచ్చిన చెలియా చెలియా చిరుకోపమా మూవీని సాయి శ్యాం డైరెక్ట్ చేసారు. నివాస్ అనే కొత్త హీరో నటించిన ఈ మూవీ కూడా నిరాశపరిచింది.

ఇక ఏప్రియల్ 4న శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఆడుతూ పడుతూ మూవీ ని బివి ప్రసాద్ తెరకెక్కించారు. ఏవరేజ్ అయింది. ఏప్రియల్ 10న విక్టరీ వెంకటేష్ నటించిన వాసు మూవీ రిలీజయింది. భూమిక హీరోయిన్. ఇద్దరి మధ్య లవ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. హరీష్ జయరాజ్ మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. కానీ సినిమా ప్లాప్ గానే మిగిలింది. ఇద్దరు స్నేహితురాళ్లకు చెందిన కథతో వచ్చిన ప్రియదర్శిని మూవీ పరాజయం పాలైంది. మాలిక్ డైరెక్టర్. మొత్తం మీద ఆది మూవీకి ఏది కూడా దరిదాపుల్లోకి రాలేకపోయింది.