నెంబర్ వన్ కోడలు సీరియల్ వనజ ఎన్ని సినిమాల్లో నటించిందో…?
No.1 kodalu serial vanaja Real life : జి తెలుగులో మంచి టీఆర్పీ రేటింగ్ తో సక్సెస్ ఫుల్ గా రన్నవుతున్న సీరియల్ గా ఆడియన్స్ ఆదరణ చూరగొన్న నెంబర్ వన్ కోడలు సీరియల్ లో నటీనటులు తమ అందంతో నటనతో ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ సీరియల్ లో వనజ తన నటనతో ఆడియన్స్ కి బాగా దగ్గరైంది.
వనజ అసలు పేరు శ్రీరుతిక. 1989ఆగస్టు 29న శ్రీకాకుళంలో జన్మించిన ఈమెకు ఓ అక్క ఉంది. సొంతూరులోనే స్టడీస్ పూర్తిచేసిన ఈమె స్టడీస్ టైం లోనే షార్ట్ ఫిలిమ్స్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది. అదే సమయంలో సినిమా ఛాన్స్ లు రావడంతో వేదం,అల్లుడు శ్రీను,రారండోయ్ వేడుక చూద్దాం,రహస్యం వంటి పలు సినిమాల్లో క్యారెక్టర్ యాక్టర్ గా చేసింది.
స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో సౌందర్య కూతురుగా నటించిన శ్రీ రితిక ఇటీవల ముగిసిన గోరింటాకు సీరియల్ లో హీరోయిన్ అక్క క్యారెక్టర్ చేసింది. జెమినిలో భాగ్యరేఖ సీరియల్ లో కూడా నటించింది. అసిస్టెంట్ డైరెక్టర్ కుమార్ ని 2020లో పెళ్లి చేసుకుంది. ఓ ట్యూబ్ ఛానల్ పెట్టి, ఎప్పటికప్పుడు పర్సనల్ విషయాలను షేర్ చేస్తోంది.