ప్రేమంటే ఇదేరా సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి…?
Premante Idera Movie : 1998 అక్టోబర్ 30న విక్టరీ వెంకటేష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమంటే ఇదేరా వచ్చింది. లవ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ ఫార్ములాతో తెరకెక్కించిన ఈ మూవీకి జయంత్ సి పరాన్జీ డైరెక్టర్. బాలీవుడ్ హీరోయిన్ ప్రీతిజింటా హీరోయిన్ గా టాలీవుడ్ లో ఈ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. రమణ గోగుల సాంగ్స్ ఆకట్టుకున్నాయి. 8న్నర కోట్ల షేర్ తో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ కెమెరా పనితనానికి నంది అవార్డు కూడా దక్కింది.
ఇక అదేరోజున రాజేంద్రప్రసాద్, రోజా నటించిన మీ ఆయన జాగ్రత్త మూవీ రిలీజయింది. అయితే పెద్దగా ఆకట్టుకోకపోవడంతో నిరాశపరిచింది. ముత్యాల రామదాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రాజేంద్రప్రసాద్ కామెడీ కొన్నిచోట్ల నవ్విస్తుంది. ప్రేమంటే ఇదేరా మూవీ తర్వాత ఆరు రోజుల తర్వాత శ్రీకాంత్ హీరోగా నటించిన గమ్యం మూవీ రిలీజయింది. రవళి హీరోయిన్ గా చేసింది. జి అనిల్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్లాపయింది.
ప్రేమంటే ఇదేరా మూవీ తర్వాత 12రోజులకు వచ్చిన శుభలేఖలు మూవీలో శ్రీకాంత్ హీరో. సినిమా హీరో పాత్రలో శ్రీకాంత్ నటించగా, అతడిని ప్రేమించే అభిమాని పాత్రలో లైలా యాక్టింగ్ కూడా ఆకట్టుకుంటుంది. ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీని ముప్పలనేని శివ డైరెక్ట్ చేసాడు. మొత్తం మీద వెంకటేష్ ప్రేమంటే ఇదేరా మూవీతో నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చాడు.