MoviesTollywood news in telugu

దర్శకేంద్రుని శిష్యుల జాబితాలో ఎంత మంది ఉన్నారో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

Tollywood directors :దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు అందరి అగ్ర హీరోలతో సినిమాలు తీసి హిట్స్ అందించారు. అలాగే మహేష్ బాబు,అల్లు అర్జున్ వంటి యంగ్ హీరోలను టాలీవుడ్ హీరోలుగా ఆయన డైరెక్షన్ లోనే ఎంట్రీ ఇప్పించారు. అయితే ప్రేమనగర్ వంటి హిట్ మూవీస్ అందించిన కె ఎస్ ప్రకాశరావు తనయుడైన రాఘవేంద్రరావు మొదట్లో పౌరాణిక బ్రహ్మా కమలాకర కామేశ్వరరావు దగ్గర అసిస్టెంట్‌గా డైరెక్టర్‌గా చేసి, తర్వాత తన తండ్రి కే.యస్. ప్రకాశరావు దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా చేసారు.

అనంతరం వి. మధుసూదన రావు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసారు. ఇక దర్శకేంద్రుని దగ్గర చాలామంది శిష్యరికం చేసారు.ఎన్నో హిట్ మూవీస్ అందించిన దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి కూడా రాఘవేంద్రరావు దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌ గా చేసారు. అంతకు ముందు పి. చంద్రశేఖర్ రెడ్డి, వి.మధుసూదనరావు దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసారు.

యాక్షన్ దర్శకులు బి.గోపాల్ కూడా ముందుగా పి.చంద్రశేఖర్ రెడ్డిగా అసిస్టెంట్‌ గా చేరి, తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘అడవి రాముడు’ నుంచి ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరి పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామానాయుడు నిర్మించిన ‘ప్రతిధ్వని’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.

వైవియస్ చౌదరి కూడా రాఘవేంద్రరావు దగ్గర ‘పట్టాభిషేకం’ సినిమా నుంచి ‘అన్నమయ్య’ సినిమా వరకు అసిస్టెంట్‌గా పనిచేసి డైరెక్టర్ అయ్యాడు. ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ కూడా దర్శకేంద్రుడు తెరకెక్కించిన కూలీ నెం. 1 సినిమాతో అసిస్టెంట్‌ గా కెరీర్ స్టార్ట్ చేసి, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘ప్రేమించుకుందాం రా’ మూవీతో దర్శకుడయ్యారు.

దర్శక ధీరుడు రాజమౌళి కెరీర్ మొదట్లో తండ్రి విజయేంద్ర ప్రసాద్ దగ్గర రైటర్ ‌గా పనిచేసి.. కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర ఎడిటింగ్ వర్క్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర దర్శకత్వ మెలుకువలు నేర్చుకున్నారు. ఒకటి రెండు సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసి, ఆ తర్వాత ‘శాంతి నివాసం’ సీరియల్‌కు సహాయ దర్శకుడిగా పనిచేసి.. రాఘవేంద్రరావు,అశ్వనీదత్ నిర్మాణంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘స్టూడెంట్ నెం.1’తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు.