మహేష్ కి ఏప్రియల్ సెంట్ మెంట్ కలిసి వస్తుందా…లేదా…?
Tollywood Super Star mahesh babu :సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా రాజకుమారుడు మూవీతో హీరోగా ఏంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తక్కువ సమయంలోనే ప్రిన్స్ స్టార్ నుంచి సూపర్ స్టార్ అయ్యాడు. తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తూ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు.
అయితే ఇండస్ట్రీలో చాలామందికి సెంటిమెంట్స్ ఉంటాయి. ఇక అభిమానులకు సైతం సెంటిమెంట్ ఉంటుంది. పోకిరి, భరత్ అను నేను మూవీస్ ఏప్రియల్ లో రిలీజై, సూపర్ హిట్ అయ్యాయి. దాంతో సూపర్ స్టార్ కి ఏప్రియల్ నెల సెంట్ మెంట్ అయింది. ఇక మే నెలలో రిలీజైతే ప్లాప్ అవుతాయని ఫాన్స్ నమ్మకం.
ఎందుకంటే నాని, బ్రహ్మోత్సవం మూవీస్ మే లోనే వచ్చి, డిజాస్టర్ అయ్యాయి. గీత గోవిందం మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కు తున్న మహేష్ తాజా మూవీ సర్కారువారి పాట ఏప్రియల్ లో రిలీజ్ చేయాలని భావించి, ఏప్రియల్ 1 ఫిక్స్ చేశారని అంటున్నారు. దీంతో మహేష్ హ్యాట్రిక్ ఖాయంగా ఫాన్స్ భావిస్తున్నారు.