కృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన సినిమాలలో ఎన్ని హిట్..?
Superstar Krishna and Director K.Raghavendrarao : సూపర్ కృష్ణ, కమర్షియల్ చిత్రాలను కొత్త పుంతలు తొక్కించిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కాంబినేషన్ లో 9చిత్రాలు రాగా, అన్ని హిట్ అయ్యాయి. ఒక్కటి కూడా ప్లాప్ కాలేదు. అలాగే చాలా మంది హీరోలకు దర్శకేంద్రుడు హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు.
కృష్ణ, రాఘవేంద్రరావు కాంబోలో 9మూవీస్ లో ఒక సినిమాలోనే అతిధిగా తప్ప అన్నింట్లో కృష్ణ హీరోయే. కృష్ణ, జయప్రద జంటగా నటించిన భలే కృష్ణుడు తో వీరి ప్రస్థానం మొదలైంది. 1980జనవరి 14న వచ్చిన ఈ మూవీ హిట్ అయింది. తర్వాత శ్రీదేవి, కృష్ణ జంటగా ఘరానా దొంగ 1980మార్చి 29న రిలీజై, సూపర్ హిట్ అయింది.
కృష్ణ, జయప్రద జంటగా ఊరికి మొనగాడు మూవీ 1981జనవరి 11న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కృష్ణ, కృష్ణంరాజు హీరోలుగా మల్టీస్టారర్ మూవీగా అడవి సింహాలు మూవీ దర్శకేంద్రుని డైరెక్షన్ లోనే వచ్చింది. 1983ఏప్రియల్ 28న రిలీజైన ఈ మూవీలో కృష్ణ సరసన శ్రీదేవి నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ అయింది.
కృష్ణ డబుల్ రోల్ చేసిన శక్తి మూవీలో జయసుధ, రాధ హీరోయిన్స్ గా చేసారు. ఈ మూవీ 1983సెప్టెంబర్ 2న రిలీజై, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన ఇద్దరు దొంగలు మూవీ 1984జనవరి 14న రిలీజయింది. కృష్ణ సరసన రాధ నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ అయింది.
కృష్ణ డబుల్ రోల్ చేసిన అగ్నిపర్వతం మూవీలో విజయశాంతి, రాధ హీరోయిన్స్ గా చేసారు. 1985జనవరి 11న రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. కృష్ణ , శ్రీదేవి జంటగా వజ్రాయుధం మూవీ అదే ఏడాది జులై 5న రిలీజై, సూపర్ హిట్ అయింది. మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజకుమారుడు 1999 జులై 30న రిలీజైన ఈ మూవీలో తండ్రి పాత్రలో అతిధిగా కృష్ణ నటించాడు.