చలికాలంలో ‘మసాలా టీ’ తాగుతున్నారా…ఈ నిజాన్ని తెలుసుకోండి
Masala Tea Benefits in Telugu :సాదరణంగా మనలో చాలా మంది ఉదయం లేవగానే టీ తాగుతూ ఉంటారు. అదే చలికాలం అయితే చెప్పనవసరం లేదు. చలికాలం రాగానే విపరీతమైన చలితో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ చలికాలంలో ఉదయం వేడివేడిగా ఒక కప్పు టీ తాగితే ఆ మజాయే వేరు. అదే మసాలా టీ తాగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాజికాయ, మిరియాలు, అల్లం వంటి సుగంధద్రవ్యాలతో తయారుచేసే మసాలా టీ రుచిలో కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ఈ చలికాలంలో చలితో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి దగ్గు, జలుబు, గొంతు నొప్పి, వైరల్ జ్వరాలు వంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి
వీటిని తగ్గించుకోవాలంటే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. రోజుకి ఒకసారి మసాలా టీ తాగితే దానిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అలాగే బరువు తగ్గటంలో కూడా పనిచేస్తుంది. శరీరంలో అదనంగా పెరిగిన కొవ్వును తగ్గించి బరువు తగ్గించడమే కాకుండా గుండె సమస్యలు లేకుండా చేస్తుంది.
అలాగే జీర్ణవ్యవస్థ చురుగ్గా పని చేసి గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటివి కూడా రాకుండా ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి మీరు కూడా రోజుకి ఒకసారి మసాల టీ తాగండి. మసాలా టీ తాగటం వలన అలసట, నిసత్తువ తగ్గి చురుకుదనం పెరుగుతుంది. అదే పెద్దవారిలో అయితే వయస్సు రీత్యా వచ్చే సమస్యలు ఉండవు.
టీ అనేది ఎక్కువగా తాగకుండా రోజులో ఒక్కసారి తాగితే టీలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎటువంటి మసాలా దినుసులతో తయారుచేసిన టీ తాగితే ఈ సీజన్ లో వచ్చే సమస్యల నుంచి బయట పడవచ్చు. కాబట్టి మీరు కూడా మసాలా టీ తాగి ఆరోగ్యంగా ఉండండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.