కీర్తి సురేష్ కెరీర్ లో ఎన్ని హిట్స్…ఎన్ని ప్లాప్స్…?
Keerthy Suresh hits and flops : మహానటి మూవీతో సావిత్రిని మరపించిన కీర్తి సురేష్ తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. అయితే ఈమె నటించిన మూవీస్ లో హిట్స్, ప్లాప్స్ అనే విషయంలోకి వెళ్తే, నేను శైలజ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. రజనీ మూవీ ప్లాప్ కాగా, రైల్ మూవీ ఏవరేజ్ గా మిగిలింది. రెమో మూవీ సూపర్ హిట్ అయింది.
ఏజంట్ భైరవ మూవీ ప్లాప్ కాగా, నేను లోకల్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అజ్ఞాతవాసి ప్లాప్ అవ్వగా, గ్యాంగ్ హిట్ అయింది. మహానటి బ్లాక్ బస్టర్ అయింది. సీమరాజా, సామి మూవీస్ ప్లాపయ్యాయి. పందెం కోడి 2మూవీ ఏవరేజ్ గా నిల్చింది.
సర్కార్ మూవీ సూపర్ హిట్ అయింది. మన్మధుడు 2, పెంగ్విన్, మిస్ ఇండియా మూవీస్ ప్లాపయ్యాయి. రంగ్ దే మూవీ ఏవరేజ్ అయింది. పెద్దన్న ప్లాప్ అయింది. ప్రస్తుతం సర్కారువారి పాట మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన చేస్తోంది.