Healthhealth tips in telugu

Gastric Problem: అరగ్లాస్ చాలు-పొట్టలో నొప్పి,గ్యాస్,ఎసిడిటీ వెంటనే తగ్గుతుంది మళ్ళీ జన్మలో రాదు

Gas problem home remedy in telugu : కడుపు ఉబ్బరంగా ఉందని చాలా మంది డాక్టర్లను సంప్రదించడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఎందుకంటే ఈ సమస్య ఉన్నప్పుడు ఏ పనీచేయలేం. స్థిమితంగా ఉండలేం. మన జీవనశైలి వల్లే ఈ సమస్య వచ్చిందని గ్రహించి, అందుకు అనుగుణమైన మార్పు చేర్పులు చేసుకోవడం అవసరం. ఎక్కువ సేపు ఒకేచోట కూర్చుని పని చేయడం, శారీరక వ్యాయామం లేకపోవడం, అతి నిద్ర లేదా అసలు నిద్రలేకపోవడం, కొన్ని వ్యాధులకు వాడే మందుల వల్ల జీర్ణాశయంలో, పేగుల్లో కొన్ని సూక్ష్మ జీవుల వల్ల గ్యాస్‌ ఏర్పడుతుంది.

గ్యాస్ సమస్య అనేది వచ్చిందంటే చాలా ఇబ్బందిగా ఉండటమే కాకుండా తొందరగా తగ్గదు. గ్యాస్ సమస్య రాగానే మనలో చాలా మంది మందులు వేసుకుంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. దీని కోసం ఉపయోగించే అన్నీ ఇంగ్రిడియన్స్ ఇంటిలో సులభంగా అందుబాటులో ఉందేవే.

అరస్పూన్ ధనియాలు, అరస్పూన్ జీలకర్ర, అరస్పూన్ సొంపు,3 మిరియాలు, చిన్న అల్లం ముక్కలను కొంచెం దంచుకొని పక్కన పెట్టాలి. మరి మెత్తగా చేయవలసిన అవసరం లేదు.

పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో తయారుచేసుకున్న ధనియాల మిశ్రమాన్ని వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. మరిగాక గ్లాస్ లో వడకట్టి తాగాలి. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు ఉదయం, సాయంత్రం అరగ్లాస్ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.

ఈ డ్రింక్ ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ విధంగా 3 రోజులు తాగితే గ్యాస్ సమస్య నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. అయితే గ్యాస్ సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ సూచనల ప్రకారం ఫాలో అవుతూ ఇంటి చిట్కా పాటిస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.

ఈ డ్రింక్ తాగటం వలన గ్యాస్ సమస్య తగ్గటమే కాకుండా అధిక బరువు సమస్య ఉన్నవారికి కూడా చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. అంతేకాకుండా డయబెటిస్ ఉన్నవారికి కూడా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

గ్యాస్ సమస్య వచ్చినప్పుడు ముందుగా ఇంటి చిట్కాలను ఫాలో అవవ్వచ్చు. అయితే గ్యాస్ సమస్య ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాలను ఫాలో అవ్వాలి. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించాలి. ఈ డ్రింక్ ని ఉదయం పరగడుపున గోరువెచ్చగా తాగితే శరీరంలో రోగనిరోదక శక్తి పెరిగి సీజనల్ గా వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి.

కాబట్టి ఈ డ్రింక్ తాగి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. దీనిలో వాడిన అన్ని ఇంగ్రిడియన్స్ మన వంటింటిలో అందుబాటులో ఉండేవే.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u