Healthhealth tips in telugu

Amla Benefits:రోజుకి 1 కాయ తింటే లక్షలు ఖర్చు పెట్టిన నయం కానీ రోగాలను నయం చేస్తుంది..ఇది నిజం

Usiri Health Benefits in Telugu :ఉష్ణప్రదేశాల్లో సహజసిద్ధంగా పెరిగే ఉసిరి చెట్టు భారతీయ సంస్కృతిలో ఎంతో పేరొందింది. హిందువులకు ఉసిరిచెట్టు ఒక పవిత్ర వృక్షం. ఉత్తర భారతదేశం వారు అక్షయ పర్వదినం సందర్భంగా ఉసిరి చెట్టు నీడలో భోజనం చేయడం శుభప్రదంగా భావిస్తారు.

తెలుగువారు కూడా కార్తీక వనసమారాధనలో ఈ చెట్టు నీడలో వనభోజనాలు చేస్తారు. ఎన్నో వైద్య పరమైన ప్రయోజనాలున్నాయని మన పూర్వీకులు పద్మపురాణంలో చెప్పగా, ఆయుర్వేదం.. ఉసిరి ఔషధ గుణాలను తెలియజేస్తోంది.

ఉసిరి కాయల రంగు, సైజులనుబట్టి రకరకాలున్నాయి. త్రిఫలాలను పంచదారతో కలిపి గతంలో ఏనుగులకు తినిపించేవారని.. అవి ఎంతో బలిష్టంగా ఉండేవని చెబుతారు. దీంతో ఇవి ఎంతో బలవర్థకమైన ఆహారమని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఔషధ గుణాలు నశింపకుండా ఉండాలంటే ఉప్పు నీటిలో నిల్వచేసుకోవాలి. లేదా ఎండబెట్టి పొడిచేసుకోవాలి.

ప్రయోజనాలు ఇవీ..
1 ఉసిరి అమృత ఫలం. శరీరానికి చలువ చేస్తుంది.

2 కేశవృద్ధి కలుగుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

3 ఉసిరి కాయ తిన్నవెంటనే నీరు తాగితే.. ఎంతో తియ్యగా ఉంటుంది. ఇది రక్తాన్ని శుభ్రపరచడంలో, కఫాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

4 ఉసిరిలో ‘సి’ విటమిన్‌ అధికంగా ఉంటుంది. ఒక పెద్ద నారింజ పండులోకంటే ఉసిరిలో ఇరవై రెట్లు సి విటమిన్‌ లభిస్తుంది.

5 ఉసిరి కాలేయానికి పనికి వచ్చే లివర్‌టానిక్‌గా పనిచేస్తుంది. దీన్ని రోజు వినియోగిస్తే లివర్‌ పనితనం పెరిగి మనిషికి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

6 మానవ శరీరంలో రోగనిరోధక శక్తి పెంచే దివ్యౌషధంగా ఉపయోగపడుతోంది.

7 అజీర్ణం, గ్యాస్టిక్‌లకు ఔషధంగా పనిచేస్తుంది.

8 తేనెతో కలిపి తాగితే కడుపులోని క్రిములు నశించి, పచ్చకామెర్లు, దగ్గు వంటి వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.

9 ఉసిరి కాయలోని పిక్కల పప్పును తీసి చూర్ణం చేసి, దాని కషాయం తాగితే జ్వరాలు తగ్గడమే కాకుండా మధుమేహ నివారణకు ఉపయోగకరం.

పలు ఆయుర్వేద ఔషధాల్లోనూ, శిరోజాల వృద్ధి మందులు, నూనెల్లోనూ, షాంపూలు వంటి అనేక రకాలైన వాటిలో ఉసిరిని ప్రధాన ఔషధంగా వినియోగిస్తున్నారు.ఉసిరి సీజన్ కానప్పుడు డ్రై ఉసిరి ముక్కలు లేదా పొడిని వాడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.