MoviesTollywood news in telugu

కాజల్ చెల్లి గుర్తు ఉందా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Kajal sister nisha agarwal :ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి అందలం దక్కుతుందో, ఎవరు ఫెయిల్యూర్ అవుతారో తెలీదు. హిట్ అనుకున్న వాళ్ళు ఫట్ అవుతారు, నిలబడలేరని అనుకున్నవాళ్ళు నిలదొక్కుకుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించి, టాప్ హీరోయిన్ గా ఎదిగిన కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా భారీ ఛాన్స్ లు అందిపుచ్చుకుంటోంది.

అయితే ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ రీ ఎంట్రీ గురించి చర్చ నడుస్తోంది. నిజానికి “ఏమైంది ఈవేళ ” మూవీతో టాలీవుడ్ లోకి నిషా అడుగుపెట్టి, హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే తన బాయ్‌ఫ్రెండ్‌ కరణ్‌ను వివాహం చేసుకుంది. దాంతో సడన్ గా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంది.

ఇండస్ట్రీలో లేకున్నా సరే, సోషల్ మీడియా ద్వారా ఫాన్స్ తో విషయాలను షేర్ చేసుకుంటూ ముచ్చట్లు ఆడుతుంది. ‘మీకు మళ్లీ సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అని తాజాగా సోషల్ మీడియాలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నిషా స్పందించింది.’మంచి స్క్రిప్ట్‌ వస్తే తప్పకుండా రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నా’ అని క్లారిటీ ఇచ్చింది. దీంతో రీ ఎంట్రీ ఖాయమని టాక్ వినిపిస్తోంది.