స్నేహ సీరియల్ లో నటించిన కావేరి ఇప్పుడు ఏమి చేస్తుందో…?
Sneha Serial Kaveri Real life : స్నేహ సీరియల్ లో నటించిన కావేరి 1975 డిసెంబర్ 1న చెన్నైలోని తమిళ ఫ్యామిలీలో జన్మించింది. 1990లో 15 ఏళ్లప్రాయంలోనే తమిళనాట సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత జగపతి బాబుతో కల్సి చిన్నారి ముద్దు పాప సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆతర్వాత జగపతి బాబు, భానుచందర్ నటించిన సాహసం మూవీలో చేసింది.
అలాగే పలు తమిళ మూవీస్ లో చేసింది. 1995లో ఈటీవీలో ప్రసారమైన స్నేహ సీరియల్ లో నటించింది. కాలనీలో సమస్యలు పరిష్కరించే పాత్రలో ఒదిగిపోయింది. అప్పట్లో విజయవంతంగా నడిచిన ఈ సీరియల్లో కామెడీతో పాటు హర్రర్ కూడా ఉంది. తర్వాత తమిళంలో అందువరు నిమిషం, పంచవనే కిళి, తూరుపొదిక్కం మనస్సు వంటి తమిళ సీరియల్స్ లో చేసింది.
ఆనంద భవన్ సీరియల్ లో కీర్తన పాత్ర చేసింది. దీని డబ్బింగ్ వెర్షన్ కూడా ఈటీవీలో ప్రసారమైంది. మెట్టివోలి అనే సీరియల్ లో ధన పాత్ర చేసింది. మెట్టెల సవ్వడి సీరియల్ గా జెమినిలో ప్రసారమైంది. రాజుగారి కూతుళ్లు సీరియల్ లో శుభలేఖ సుధాకర్ కి పెద్ద కూతురుగా నటించింది.
కలవారి కోడలు సీరియల్ లో వదిన పాత్ర చేసిన కావేరి,ఆతర్వాత సూర్య, కావేరి, కస్తూరి వంటి సీరియల్స్ లో కావేరి నటించింది.
ఝాన్సీ సీరియల్ లో రాధికకు ఆడపడుచుగా చేసింది. అపరంజిత తమిళ వెర్షన్ సీరియల్ లో రమ్యకృష్ణతో కల్సి నటించింది. కొడుమళ్లాయి సీరియల్ తెలుగులో విస్సా టివిలో సిరిమల్లెగా ప్రసారమైంది. తమిళ వెర్షన్ లో వచ్చిన సీరియల్ తెలుగులోవచ్చిన పవిత్ర ప్రేమలో నటించింది. రమ్యకృష్ణతో కల్సి వంశం సీరియల్ లో నటించింది.
తెలుగులో ఇది కుటుంబం పేరిట ప్రసారమైంది. గాయత్రీ అనే తమిళ సీరియల్ లో నటించి, 2013లో కేరళకు చెందిన బిజినెస్ మ్యాన్ రాకేష్ ను పెళ్ళి చేసుకుంది. తల్లి కేన్సర్ తో చనిపోవడంతో డిప్రెషన్ కి గురై, గుర్తుపట్టలేనంత సన్నగా మారిపోయింది.