కృష్ణంరాజు మొదటి భార్య గురించి ఈ విషయాలు తెలుసా?
krishnam raju first wife :సినిమా రంగంలో ఎన్టీఆర్, అక్కినేని తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ఒక శకంగా నడిచింది. భక్తకన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, పులిబిడ్డ, కటకటాల రుద్రయ్య వంటి ఎన్నో హిట్ మూవీస్ చేసారు. ఆయనకు కుమారులు లేకపోవడంతో ఆయన సోదరుడు యువి సూర్యనారాయణ రాజు కుమారుడైన ప్రభాస్ సినిమా రంగ ప్రవేశం చేసాడు.
అయితే కృష్ణంరాజుకి మొత్తం నలుగురు కుమార్తెలు ఉండగా, మరో కుమార్తెను కూడా దత్తత తీసుకున్నారు. మొదటి భార్య కు ఒక్కర్తే కుమార్తె. ఆమెకు పెళ్లయి, పిల్లల్తో హ్యాపీగా ఉంది. రెండో భార్యకు ముగ్గురు ఆడపిల్లలు, ఇంకో కుమార్తెను దత్తత తీసుకున్నారు. 1995లో కారుప్రమాదంలో మొదటి భార్య సీతాదేవి కన్నుమూశారు. దీంతో కృష్ణంరాజు షాక్ కి గురయ్యారు.
.
ఎంతకీ డిప్రెషన్ నుంచి తేరుకోకపోవడంతో శ్యామలాదేవిని ఇచ్చి పెళ్ళిచేసారు. శ్యామలాదేవితో చాలా వేడుకల్లో కృష్ణంరాజు కన్పిస్తున్న సంగతి తెల్సిందే. సోదరుడు కూడా మరణించడంతో ప్రభాస్ ని సొంత కొడుకులా కృష్ణంరాజు భావిస్తున్నారు. ఇక ప్రభాస్ బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతి పొంది, వరుస పాన్ ఇండియా మూవీస్ తో దూసుకుపోతున్నాడు.