కార్తీక దీపం చిన్నారులకు రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాలసిందే
karthika deepam serial : సినిమాలను మించిన స్థాయిలో బుల్లితెరపై సీరియల్స్ కి డిమాండ్ నడుస్తోంది. పోటాపోటీగా టీఆర్ఫీ రేటింగ్ తో సీరియల్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. దాంతో బుల్లితెర నటులకు మంచి గిరాకీ ఏర్పడి, పారితోషికం కూడా ఎక్కువే లభిస్తోంది. ఇక స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులందరినీ అలరిస్తోంది.
ఈ సీరియల్ కి ఉన్న డిమాండ్ మాములు రేంజ్ లో లేదు. ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ చూస్తూ ఉండటంతో టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఇందులో నటించే నటులకు కూడా మంచి పేరు వచ్చింది. అలాగే రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుతున్నట్లు టాక్. ప్రధాన పాత్రలైన దీప, కార్తీక్ ల నటన ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే వీళ్ళ కూతురుగా సౌర్య, హిమల పాత్రలు కూడా ప్రేక్షకుల మదిని దోచాయి.
పిల్లల పాత్రలే అయినా తమ మాటలతో చిచ్చర పిడుగులుగా తమ నటన, ఆలోచనతో ఆసక్తి రేకెత్తిస్తున్నారు. అందుకే వీళ్ళకు ఒక్క రోజుకే రూ.7 వేలు ఇస్తున్నారట. ఈ సీరియల్లో దీప, కార్తీక్ లు పెళ్లి చేసుకుని, కొన్ని మనస్పర్థల వల్ల జరిగిన గొడవ వల్ల దూరం అవ్వడంతో ఎప్పుడు కలుస్తారా అని ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.