యముడిగా కైకాల సత్యనారాయణ చేసిన సినిమాలు ఎన్ని…?
kaikala sathyanarayana movies in yama role : నవరస నట సార్వభౌమ బిరుదాంకితుడు కైకాల సత్యనారాయణ పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో పలు రకాల పాత్రలు వేసి మెప్పించారు. భయపెట్టే విలనిజం నుంచి కరుణ రసం, కామెడీ పాత్రల్లో సైతం తన నటనతో మెప్పించిన నటుడిగా తెలుగు ఆడియన్స్ మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
యమగోల చిత్రంలో యముడు పాత్రకు వన్నె తెచ్చిన కైకాల ఆతర్వాత పలు సినిమాల్లో యముడు పాత్ర వేశారు. తాతినేని రామారావు డైరెక్షన్ లో వచ్చిన యమగోల మూవీ 1977లో బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ కి ఎంతటి పేరు తెచ్చిందో యముడిగా కైకాల సత్యనారాయణకు కూడా అంతటి పేరు తెచ్చింది. యముడు అంటే ఇలా ఉంటాడా అనిపించేలా మైమరపించారు.
ఇక 1988లో మెగాస్టార్ చిరంజీవి నటించిన యముడికి మొగుడు మూవీలో కైకాల మరోసారి యముడు పాత్రకు జీవం పోశారు. ఇందులో కూడా యముడిగా కైకాల తన నటనతో మెప్పించారు. అలాగే ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన యమలీల మూవీలో కూడా సత్యనారాయణ మళ్ళీ యముడిగా నటించి మెప్పించారు. అలాగే యమగోల మళ్ళీ మొదలైంది మూవీలో కూడా కొంతసేపు యముడు పాత్రలో కైకాల కన్పించారు.