MoviesTollywood news in telugu

అబ్బాయిల్లో పిచ్చ ఫాలోయింగ్ ఉన్నఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Tollywood Heroine priyanka jawalkar : ఇండస్ట్రీలో నటీనటులు, సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు చూస్తే అస్సలు గుర్తుపట్టలేం. పైగా సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి ఫోటోలు, వీడియోలు.చాలా వస్తున్నాయి. ఇక ఫాన్స్ కి విందుభోజనంలా ఉంటోంది. ముఖ్యంగా బ్యూటీ హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ, సందడి చేస్తున్నారు.

తాజాగా ఈ ఓ బ్యూటీ చిన్నప్పటి ఫోటో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈమె ఎవరా అని చూస్తే, తొలిమూవీతోనే ప్రేక్షకుల మనసులను దోచుకున్న ప్రియాంక జవల్కర్. ట్యాక్సీ వాలా మూవీతో టాలీవుడ్ లో ఈ భామ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఆమె నటించిన తిమ్మరుసు ఫర్వాలేదనిపించింది.

ఎస్ఆర్ కళ్యాణమండపం మూవీ హిట్‌ అయింది. తాజాగా ఐదో చిత్రం ‘గమనం లో నటించింది. ఈ మూవీ వచ్చే డిసెంబర్‌లో రిలీజ్ కాబోతోంది. అందంతో పాటు అభినయంతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకున్న ప్రియాంక జవల్కర్‌కు తెలుగునాట మంచి పేరు వచ్చింది.