Healthhealth tips in telugu

పరగడుపున మొలకెత్తిన విత్తనాలు తింటున్నారా…అయితే ఈ నిజాలు మీకోసమే

sprouts Health Benefits in Telugu :ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి మొలకలను తింటూ ఉన్నారు. మొలకెత్తిన విత్తనాలలో ఎన్నో పోషకాలు,ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పెసర్లు, నల్ల శనగలు, చిక్కుళ్లు వంటి ధాన్యాలను మొలకలుగా తయారుచేసుకొని తింటూ ఉంటారు. ఈ ధాన్యాలను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు నీటిని తీసేసి ఒక క్లాత్ లో మూట కడితే మరుసటి రోజు మొలకలు వస్తాయి. ఈ మొలకలను తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
sprouts benefits
వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ డి సమృద్దిగా ఉంటుంది. ఈ మొలకలను ప్రతి రోజు తింటే అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే రక్తపోటు,డయబెటిస్ వంటివి నియంత్రణలో ఉంటాయి. జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది.
Molakalu health benefits
అంతేకాకుండా రక్తప్రసరణ బాగా సాగి రక్తపోటు నియంత్రణలో ఉండటం, చెడు కొలస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహించటం వలన గుండెకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా ఉంటాయి. అయితే వీటిని పరగడుపున తింటే కొన్ని సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

పచ్చి మొలకలలో హానికరమైన బ్యాక్టిరియా ఉంటుంది. దీనివలన ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. మొలకలు తిన్న 12-72 గంటల తర్వాత చాలా మందికి అతిసారం, పొత్తి కడుపు తిమ్మిర్లు, వాంతులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమస్యలు పిల్లలు, గర్భిణీ స్త్రీలలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
chickpeas-sprouts benefits
మొలకలను పచ్చిగా తినకుండా ఉడికించి లేదా పాన్ లో కాస్త నూనె వేసి తాలింపు పెట్టుకొని తింటే జీర్ణం బాగా అవ్వటమే కాకుండా మొలకల్లో ఉన్న పోషకాలను శరీరం పూర్తిగా గ్రహిస్తుంది. పచ్చి మొలకలు జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది. వీటిలో ఉండే పోషకాలను పూర్తిగా శరీరం గ్రహించదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.