బొమ్మరిల్లు సినిమాకి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి…?
Bommarillu Full Movie : భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా బ్లాక్ బస్టర్ అయింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ మూవీలో హీరో సిద్ధార్ధ్, హీరోయిన్ జెనీలియా జంటగా నటించారు. ప్రకాష్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు కీలక పాత్రల్లో చేసిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ముఖ్యంగా యూత్ ని బాగా ఆకట్టుకుంది. 2006 ఆగస్టు 9న రిలీజైన ఈ మూవీ 6కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా, దాదాపు 50కోట్లు కలెక్ట్ చేసింది. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ చక్కని సంగీతం అందించాడు.
బొమ్మరిల్లుకి 12రోజులు ముందుగా జులై 28న అమ్మచెప్పింది మూవీ రిలీజయింది. శర్వానంద్ నటించిన ఈ మూవీలో అతడి తల్లిగా సుహాసిని నటించింది. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆర్య, భరత్ నటించిన గాయం మూవీ తమిళ్ నుంచి తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసారు. ఇది కూడా పరాజయం పాలైంది.
మోహన్ బాబు, మంచు విష్ణు నటించిన గేమ్ మూవీ ఆగస్టు 4న రిలీజయింది. ఓ ప్రముఖ పాత్రలో శోభన నటించింది. జి రామ్ ప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏవరేజ్ అయింది. ఆగస్టు 10న వీధి మూవీ వచ్చింది. శర్వానంద్ నటించిన ఈ మూవీ ఫెయిల్ అయింది. ఆగస్టు 11న బ్రహ్మాస్త్రం మూవీ వచ్చింది. జగపతి బాబు, నేహా ఒబెరాయ్ నటించిన ఈ మూవీ కూడా పరాజయం పాలైంది.
అదేరోజు అల్లరి నరేష్, బాలాదిత్య నటించిన రూమ్ మేట్స్ మూవీలో నవనీత్ హీరోయిన్ గా చేసింది. ఏవీఎస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏవరేజ్ అయింది. ఆగస్టు 18న సునీల్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన అందాల రాముడు మూవీ హిట్ కొట్టి, కమర్షియల్ సక్సెస్ అందుకుంది.