Beauty Tips

Blackheads: 5 నిమిషాల్లో బ్లాక్ హెడ్స్ ను ఎలా పోగొట్టుకోవాలి?

Blackheads: 5 నిమిషాల్లో బ్లాక్ హెడ్స్ ను ఎలా పోగొట్టుకోవాలి.. యువతను ప్రధానంగా వేధించే చర్మ సమస్యల్లో బ్లాక్ హెడ్స్ ఒకటి. ముక్కుపై వచ్చే ఈ నల్లటి మచ్చలను తొలగించినా.. పదే పదే వస్తూ విసిగిస్తుంటాయి. వీటిని తొలగించే కొద్దీ వస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. చర్మం ఎర్రగా కందిపోతుంది.

సెబాషియస్ గ్రంథి సీబం అనే తైలాన్ని ఎక్కువగా స్రవించడం వల్ల.. అది మృత కణాలతో కలిసి చర్మ రంధ్రాలను పూడ్చేయడంతో బ్లాక్ హెడ్స్ సమస్య తలెత్తుతుంది. కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా వీటిని ఈజీగా తొలగించవచ్చు.

ముఖాన్ని అందవిహీనంగా మార్చే వాటిలో బ్లాక్ హెడ్స్ ముఖ్యమైనవి. చర్మంలో సేబాషియన్ అనే గ్రంధి నూనె పదార్ధాలను అంటే సెబమ్ ని ఎక్కువగా ఉత్పత్తి చేయటం వలన బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. అలాగే చర్మానికి రంగుని ఇచ్చే పిగ్మెంట్ ఎక్కువ అయినా కూడా ఈ సమస్య వస్తుంది. అంతేకాక చర్మం మీద పేరుకుపోయిన దుమ్ము కూడా బ్లాక్ హెడ్స్ రావటానికి కారణం అవుతుంది.

బ్లాక్ హెడ్స్ రావటం ప్రారంభం అయినా వెంటనే అశ్రద్ధ చేయకుండా తొలగించుకోవాలి. బ్లాక్ హెడ్స్ రాగానే కంగారు పడిపోతారు. కంగారు పడవల్సిన అవసరం లేదు. బ్లాక్ హెడ్స్ పోవటానికి చికిత్స తీసుకున్న తాత్కాలికంగా తగ్గుతుంది. కానీ శాశ్వతంగా పోవు. ఇప్పుడు చెప్పబోయే చిట్కా ఫాలో అయితే బ్లాక్ హెడ్స్ ని శాశ్వతంగా తొలగించుకోవచ్చు.

ఇప్పుడు ఆ చిట్కా గురించి వివరంగా తెలుసుకుందాం. బ్లాక్ హెడ్స్ ని తొలగించుకోవటానికి మన ఇంటిలో ఉండే సహజమైన ఇంగ్రిడియన్స్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఒక టమోటా తీసుకొని దానిని సగానికి కట్ చేయాలి. సగానికి కట్ చేసిన టమోటా ముక్కను పంచదారలో అద్ది
బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే బ్లాక్ హెడ్స్ సులభంగా తొలగిపోతాయి. టమోటా రసాన్ని ముఖానికి రాయటం వలన చర్మంపై ఉన్న బ్లాక్ హెడ్స్ ని సమర్థవంతంగా తొలగిస్తుంది. పంచదార చర్మంపై మృత కణాలను తొలగిస్తుంది. దాంతో బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u