అఖండలో ఓ కీ రోల్ ప్లే చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
Akhanda movie fame naveena reddy :ఇండస్ట్రీలో కొందరి కాంబినేషన్ అనగానే అంచనాలు భారీగానే ఉంటాయి. కనీసం మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. అందులో భాగంగా గతంలో సింహ, లెజెండ్ సినిమాలు నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చి, రికార్డులు క్రియేట్ చేసాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో భారీ అంచనాలతో రిలీజైన ‘అఖండ’ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది.
ఇందులో మురళీ కృష్ణ, అఖండ రెండు పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడని విమర్శకులు సైతం అంటున్నారు.
గతంలో రామ్ చరణ్ తో తీసిన వినయ విధేయ రామ మూవీతో డిజాస్టర్ జాబితాలో చేరిన బోయపాటి కసిగా తీసిన అఖండలో తనదైన మార్క్ చూపించాడు.
ముఖ్యంగా నందమూరి ఫాన్స్ కి పండగ వాతావరణం క్రియేట్ చేసాడు. ఇక ఈ సినిమాలో నటి నవీనారెడ్డి కీలక పాత్రలో కనిపించింది. గతంలో ఎఫ్2 సినిమాలో ఓ చిన్న రోల్ చేసింది. ఇదే ఆమెకి మొదటిచిత్రం. ఆ తర్వాత వెంకీమామ, భీష్మ,అద్భుతం, హిట్ వంటి మూవీస్ లో చేసింది. దేవయాని,అర్ధశతాబ్దపు సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఇలా గతంలో చేసిన సినిమాల్లో పెద్దగా గుర్తింపు రానప్పటికీ అఖండలో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొద్దిసేపే కనిపిస్తుంది. అయితేనేం నవీనాకి మంచి గుర్తింపుని ఇచ్చింది. ఇక మెగాస్టార్ చిరంజీవికి నవీనా పెద్ద అభిమాని. చిరంజీవికి కరోనా సోకినప్పుడు త్వరగా కోలుకోవాలని ఎన్నో పూజలు చేసింది. ఇండస్ట్రీలో ఉన్నంతవరకు సినిమాలు చేస్తానని చెప్పే నవీనారెడ్డి సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటుంది. నవీనారెడ్డి పక్కా హైదరాబాదు అమ్మాయి. ఆమెకి ఓ చెల్లెలు ఉంది.