Healthhealth tips in telugu

రోజుకి ఒకసారి – కాల్షియం లోపం లేకుండా ఎముకల బలహీనత లేకుండా నడవలేనివారు సైతం నడుస్తారు

calcium rich foods In Telugu : మనలో చాలా మంది 65 ఏళ్ల వయసులో కూడా 35 ఏళ్ల వయసున్న వారిగా ఉండాలని కోరు కుంటారు. అలా కోరుకోవటం కూడా సహజమే. శరీరం అలసట లేకుండా చురుగ్గా ఉండాలంటే ఇప్పుడు చెప్పే రెమిడీ ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పుడు చెప్పే డ్రింక్ ని తాగితే నీరసం, అలసట, శారీరక బలహీనత అనేవి లేకుండా చాలా చురుకుగా ఉంటారు.
walnut benefits in telugu
ఉదయం లేవగానే చాలా మంది అలసటగా ఉంటారు. ఉదయం లేవగానే అలసట బలహీనత వంటి సమస్యలు ఉన్నప్పుడు అసలు అశ్రద్ధ చేయ కూడదు. కాల్షియం లోపం కారణంగా కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అలా సాంశ్యాలు ఏమి లేకుండా ఉండాలంటే కాల్షియం లోపం లేకుండా చూసుకోవాలి.

దీని కోసం పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక 5 కిస్ మిస్ లను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. అలాగే 3 వాల్ నట్స్ ని కూడా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. ఈ విధంగా మరగటం వలన కిస్ మిస్, వాల్ నట్స్ లో ఉండే పోషకాలు పాలల్లోకి చేరతాయి.

వీటిని ఉడికించినప్పుడు పోషకాలు రెట్టింపు అవుతాయి. కిస్ మిస్ లో ఇనుము, కాల్షియం, పొటాషియం మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఈ పాలను గ్లాస్ లో పోసి ఉదయం లేదా సాయంత్రం సమయంలో తీసుకోవచ్చు. ఉదయం సమయంలో తీసుకుంటే రోజంతా ఉషారుగా ఉంటారు.

ఈ పాలను తీసుకోవటం వలన కాల్షియం లోపం లేకుండా ఎముకల బలహీనత లేకుండా ఉండటమే కాకుండా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కీళ్ల మధ్య జిగురు పెరుగుతుంది. రక్తహీనత సమస్య కూడా తొలగిపోతుంది.