తమన్నాకు ఇష్టమైన సినిమా ఏమిటో తెలుసా ?
Tollywood Heroine tamanna :పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా మాస్ట్రో మూవీతో తెలుగు ఆడియన్స్ ని పలకరించింది. పలువురు అగ్ర హీరోల సరసన నటించడమే కాకుండా సైరా మూవీతో మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా నటించింది.
తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీలో కూడా నటిస్తోంది. అలాగే ఎఫ్ 2 సీక్వెల్ గా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న ఎఫ్ 3 లో కూడా నటిస్తోంది. మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం తో బుల్లితెర మీద కూడా సందడి చేస్తోంది. వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.
గత పదేళ్లుగా తెలుగు , తమిళ భాషల్లో నటిస్తున్న తమన్నా మంచి ఫాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్యూలో ఆమెకు ఇష్టమైన మూవీ ఇప్పటికీ కూడా ‘ది మమ్మీ’ అని స్పష్టం చేసింది.