“రెడీ” సినిమాకి పోటీ వచ్చి ఓడిన సినిమాలు ఇవే…!
Ready Movie : శ్రీను వైట్ల డైరెక్షన్ లో స్రవంతి రవికిశోర్ నిర్మించిన రెఢీ మూవీలో హీరో రామ్ పోతినేని అద్భుత నటనతో సినిమాను బ్లాక్ బస్టర్ చేసాడు. జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదనపు బలాన్ని ఇచ్చింది. ఇక బ్రహ్మానందం పవర్ ఫుల్ కామెడీ రోల్ తో అదరగొట్టాడు.
17కోట్లు కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ మూవీ 2008జూన్ 19న రిలీజయింది.ఈ మూవీకి 13రోజుల ముందుగా కమెడియన్ అలీ హీరోగా సోంబేరి మూవీ వచ్చింది. లిరిక్ రైటర్ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ నిరాశ పరిచింది.
రెఢీ మూవీకి 6రోజుల ముందుగా విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన దశావతారం తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసారు. కె ఎస్ రవికుమార్ తెరకెక్కించిన ఈ మూవీ మొదట్లో అంతగా ఆకట్టుకోకపోయినా తర్వాత ఆదరణకు నోచుకుంది.
జూన్ 27న నితిన్ నటించిన విక్టరీ మూవీ రిలీజయింది. అయితే ఇది ప్లాప్ అయింది. హీరో వెంకట్, దిలీప్ జోషి నటించిన కొంచెం కొత్తగా మూవీ జూన్ 28న రిలీజయింది. హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీ గా వచ్చిన ఈ సినిమా ఆడలేదు.
యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ నటించిన గోరింటాకు మూవీ విఆర్ ప్రతాప్ డైరెక్షన్ లో వచ్చింది. చెల్లెలి సెంటిమెంట్ కి పెద్దపీట వేస్తూ తీసిన ఈ మూవీలో చెల్లెలి క్యారెక్టర్ లో మీరాజాస్మిన్ నటించింది. హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ నటించింది. సినిమా మంచి విజయాన్ని అందుకుంది.