ఈ సమస్యలు ఉన్నవారు క్యాబేజీ తింటే ఏమి అవుతుందో తెలుసా ?
Cabbage Side Effects in Telugu : క్యాబేజీ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. క్యాబేజీ లో యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ తరిమి కొట్టడమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా కణాలలో వాపును తగ్గించటానికి సహాయపడుతుంది. క్యాబేజీ లో విటమిన్ ఎ, బి, సి, పొటాషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.
ఈ చలి కాలంలో క్యాబేజీ తీసుకుంటే సీజనల్ గా వచ్చే ఫ్లూ ని తగ్గిస్తుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది.
అంతేకాకుండా జ్ఞాపక శక్తిని, మానసికస్థితిని మెరుగుపరుస్తుంది. అమినో యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన కండరాల నొప్పులను తగ్గిస్తుంది.
పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
డయాబెటిస్ తో బాధపడుతున్నవారికి క్యాబేజీ అనేది మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు ఉండటం వల్ల క్యాబేజీ డయాబెటిస్ తో బాధపడేవారికి ప్రయోజనం అందిస్తుంది. బ్లడ్ షుగర్ ను రెగ్యులేట్ చేస్తుంది.
అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు క్యాబేజీకి దూరంగా ఉంటేనే మంచిది. అలర్జీ సమస్య ఉన్న వారు క్యాబేజీ అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవలసి వస్తే డాక్టర్ సలహా పాటించాలి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా క్యాబేజీ కి దూరంగా ఉండాలి. శస్త్ర చికిత్స చేయించుకున్న వారు రెండు వారాల వరకు క్యాబేజీ తినకూడదు.