బంగారం కంటే విలువైన ఈ మొక్క ఎక్కడైనా కనబడితే అసలు వదలద్దు…ఎందుకంటే
Gaddi Gulabi Benefits in Telugu : ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. వాటిల్లో ఉన్న ప్రయోజనాలు గురించి మనకు తెలియదు. దాంతో వాటిని పిచ్చి మొక్కలుగా భావిస్తాము. పైసా ఖర్చు లేకుండా రంగు రంగుల పూలతో అందంగా విచ్చుకుని, ఆహ్లాదాన్ని పంచే అపురూపమైన మొక్క అయిన గడ్డి గులాబీ గురించి తెలుసుకుందాం. వీటిని గడ్డి పూలు, నాచు గులాబీలు అనీ పిలుస్తారు.
ఈ పూలు విచ్చుకోవటానికి కాస్త సూర్యరశ్మి ఉన్నా సరిపోతుంది. చిన్నకాడ తుంచి నాటితే చాలు గబగబా ఎదిగిపోయి, చకచకా పువ్వులు పూసేస్తాయి. ఇవి నాటిన కొన్నాళ్ళకే పెద్ద పూలవనమైపోతుంది. దీనిలో ఉన్న ఔషద గుణాలు గురించి తెలిస్తే అసలు వదిలిపెట్టరు.
ముఖం మీద నల్లని మచ్చలను.మొటిమలను తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ మొక్క పువ్వులను కోసి శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ గా చేసి దానిలో కొంచెం తేనె కలిపి ముఖానికి రాసి పావుగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే నల్లని మచ్చలు,మొటిమలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
జుట్టు రాలే సమస్య,చుండ్రు ఉన్నప్పుడు ఈ మొక్కల కాండం, ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి కొంచెం కొబ్బరి నూనె కలిపి జుట్టుకి పట్టించి గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.