Healthhealth tips in telugu

అరగ్లాస్ – ఛాతీ, గొంతు,ఊపిరితిత్తులలో కఫం తగ్గించి గొంతు నొప్పి,గొంతు ఇన్ ఫెక్షన్ లేకుండా చేస్తుంది

Cough Home Remedies In Telugu : చలి గాలులు విపరీతంగా ఉన్నాయి. అలాగే మంచు కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ సమయంలో దగ్గు,జలుబు వంటివి చాలా తొందరగా వచ్చేస్తాయి. దగ్గు, గొంతు నొప్పి వంటివి వచ్చాయంటే తొందరగా తగ్గక చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. ఈ సమస్యలు తగ్గటానికి ఒక మంచి డ్రింక్ గురించి తెలుసుకుందాం.
Biryani leaves health benefits In Telugu
కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. దగ్గు,గొంతు నొప్పి వంటివి వచ్చినప్పుడు ప్రారంభ దశలోనే ఈ డ్రింక్ తాగితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కా కోసం 4 ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ఇవన్నీ ఇంటిలో అందుబాటులో ఉండేవే.

పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి గ్లాస్ నీటిని పోసి దానిలో అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత 2 బిరియాని ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి.ఇలా మరిగిస్తే అల్లం, బిరియాని ఆకులో ఉన్న పోషకాలు నీటిలోకి చేరతాయి.

మరిగిన ఈ నీటిని గ్లాస్ లోకి వడకట్టి దానిలో అరచెక్క నిమ్మరసం, అరస్పూన్ తేనె కలుపుకొని తాగాలి. ఉదయం ఒకసారి,సాయంత్రం ఒకసారి తాగితే 3 రోజుల్లోనే దగ్గు,గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్, జలుబు వంటివి అన్నీ తగ్గిపోతాయి. డయబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి.