MoviesTollywood news in telugu

తల్లి ఒడిలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తోన్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా…?

Tollywood Heroine tamanna : సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయం దాగడం లేదు. హీరో, హీరోయిన్స్ ఎప్పటికప్పుడు తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఫాన్స్ తో ముచ్చట్లు కూడా చేస్తున్నారు. తమ అభిమాన హీరోయిన్ ఫోటోలను ఏవైనా సరే.. క్షణాల్లో ఫాన్స్ వైరల్ చేస్తున్నారు. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ చిన్నప్పుడు తల్లి ఒడిలో ఒదిగిపోయిన ఇప్పటి స్టార్ హీరోయిన్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ హీరోయిన్ ఎవరో కాదు, మిల్కీ బ్యూటీ గా ప్రాచుర్యం పొందిన తమన్నా భాటియా. తెలుగు,తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసి విశేషంగా ఫాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న తమన్నా ఇప్పటి అగ్ర హీరోలందరి సరసన నటించింది. శ్రీ మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీ డేస్’ చిత్రం కీలక మలుపు తిప్పింది.

ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో నాగచైతన్యతో 100% లవ్, అల్లు అర్జున్ తో బద్రినాధ్, రామ్ చరణ్ తో రచ్చ, ప్రభాస్ తో బాహుబలి, సైరా లో మెగాస్టార్ చిరంజీవి వంటి హీరోలతో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్‌ అందుకుంది. మెగాస్టార్ తో భోళా శంకర్ మూవీలో చేస్తోంది. 11th Hour, నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్‌లతో ఓటీటీలలోనూ తన సత్తా చాటింది. ప్రస్తుతం హిందీలో ప్లాన్ ఏ ప్లాన్ బీ, బోలే చుడియా అలాగే తెలుగులో ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం, థట్ ఇజ్ మహాలక్ష్మి మూవీస్ లో నటిస్తోంది.