‘పుష్ప’ లో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
pushpa movie actors remuneration : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన పుష్ప సినిమా డిసెంబర్17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాలన్నింటిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప ఇప్పటికే రికార్డు నెలకొల్పింది. సినిమా పట్ల అన్నిచోట్లా ఒకే టాక్ తో నడుస్తున్న నేపథ్యంలో చిత్రబృందం ఆనందం వ్యక్తంచేస్తోంది.
అయితే ఈ సినిమాలో రెమ్యునరేషన్స్ గురించి ఇప్పుడొక వార్త చక్కర్లు కొడుతోంది. బన్నీ సరసన రష్మిక మందన నటించగా, కమెడియన్ సునీల్ ఇందులో విలన్ గా నటించాడు. సమంత స్పెషల్ సాంగ్ చేసింది. సుకుమార్ డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాను భారీ అంచనాలకు తగ్గట్టు నిలబెట్టింది. గంధపు చెక్కల స్మగ్లర్ గా ఊర మాస్ రోల్ చేసిన అల్లు అర్జున్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు.
బన్నీ ఈ మూవీ కోసం ఏకంగా 50కోట్లు అందుకున్నట్లు టాక్ నడుస్తోంది. సుకుమార్ కి 25కోట్లు ముట్టచెప్పారని తెలుస్తోంది. హీరోయిన్ రష్మిక 10కోట్ల వరకూ తీసుకున్నట్లు తెలుస్తోంది. విలన్ ఫాహిద్ ఫాజిల్, అలాగే దేవిశ్రీ ప్రసాద్ మూడున్నర కోట్లు చొప్పున అందుకున్నట్లు చెబుతున్నారు. ఒకచోట విలన్ రోల్ మెరిసిన యాంకర్ అనసూయ 2లక్షలు తీసుకుందట. ఇక సమంత స్పెషల్ సాంగ్ లో యాక్ట్ చేసినందుకు కోటిన్నర తీసుకుందని టాక్.