RRR లో తారక్ కోసం వాడిన బైక్ రేటు ఎంతో తెలుసా ?
RRR Bike : కరోనా తగ్గుముఖం పట్టడంతో బాక్సాఫీస్ దగ్గర సినీ జాతర జరగబోతోంది. ఇప్పటికే అఖండ మూవీతో బాలకృష్ణ అఖండ విజయం అందుకోగా, బన్నీ నటించిన పుష్ప కూడా విడుదల అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో తెరకెక్కిస్తున్న RRR పై భారీ అంచనాలున్నాయి.
ఇక ఈ మూవీ విషయంలో ఎక్కడా రాజీపడలేదని దర్శకుడు జక్కన్న ఇప్పటికే చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ వాడిన బైక్ గురించి చాలా రీసెర్చ్ చేశారట. ఈ బైక్ పేరు వెలోసెట్ రెట్రో బైక్. ఇది 1934 కు చెందిన బ్రిటన్‌కి సంబంధించిన ఎమ్ సిరీస్ బైక్. ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ బర్మింగ్‌హామ్‌లో ఉంది. 1920 నుంచి 1950 వరకు…వెలోసెట్ అంతర్జాతీయ మోటార్ రేసింగ్ విభాగంలో ప్రధాన పోటీదారుగా నిలిచిన శక్తివంతమైన 350 సిసి, 500 సిసి బైక్‌లను తయారు చేసింది.
అయితే ఇతర ఆటోమొబైల్ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ రావడంతో వెలోసెట్ బైక్ల తమ ఉత్పత్తులను ఆపేసింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ బైక్స్ అత్యంత ప్రాచుర్యం పొందాయి. 1971లో పిభ్రవరి తర్వాత అధికారికంగా బైక్‌ల ఉత్పత్తి వెలోసెట్ నిలిపివేసింది. అయితే ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం ఈ బైక్‌లో కొన్ని మార్పులు చేశారు.
ఇలాంటి రెట్రో బైక్స్ ఎక్కువగా ఆక్షన్ వెబ్‌సైట్‌లోనే కనిపిస్తాయి.ఇక ఈ సినిమాలో ఆ బైక్ కోసం రాజమౌళి ఏకంగా పది లక్షలు ఖర్చు పెట్టాడని టాక్. కాగా ఈ సినిమా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ అన్ని భాషల్లో మొదలు పెట్టేసారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. షూటింగ్ పార్ట్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో చిత్రబృందం బిజీగా ఉంది.