శ్యామ్ సింగరాయ్ ట్విట్టర్ Review…ఎలా ఉందంటే…
Shyam Singha Roy Movie Review In Telugu : నేచురల్ స్టార్ నాని హీరోగా సాయిపల్లవి-క్రుతి శెట్టి- మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ లుగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ఈ రోజు అభిమానుల ముందుకి వచ్చింది. ట్విట్టర్ రివ్యూ ప్రకారం సినిమా టాక్ ఏమిటో చూద్దాం. ఈ సినిమా రాహుల్ సంక్రుత్యన్ డైరెక్షన్ లో కలకత్తా నేపథ్యంలో తెరకెక్కింది.
ఈ సినిమా గురించి పాజిటీవ్ కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా రాహుల్ డైరెక్షన్, నానీ యాక్టింగ్, సాయి పల్లవి స్క్రీన్ ప్రజన్స్ కు గట్టిగా మార్కులు పడ్డాయి. వరుస పరాజయాలతో ఉన్న నాని ఈ సినిమాతో హిట్ కొట్టాడనే చెప్పవచ్చు. ఇప్పటివరకు చేయని కొత్త గెటప్ తో ఈ సినిమాలో నటించాడు.
డిఫరెంట్ క్యారెక్టర్ చేసి ఆడియన్స్ నుంచి మార్కులు కొట్టేశాడు. నాని నటనకు డైలాగ్ డెలివరీకి చాలా మంది ఫిదా అయిపోయారు. ముఖ్యంగా నీ పేరు ఏంటీ అంటే శ్యామ్ సింగరాయ్ అంటూ వచ్చే సన్నీవేశం. ఇలాంటి కొన్ని సీన్స్ నానిని స్క్రీన్ పై కొత్తగా చూపించాయి.
ఈ సినిమాకి సాయి పల్లవి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని అంటున్నారు. శ్యామ్ సింగరాయ్ సినిమా చూసి ప్రతీ ప్రేక్షకుడు సాయి పల్లవిని, ఆమె నటనను చూసి ఫిదా అవ్వకుండా ఉండలేరు. ఆమె నటన, డాన్స్, స్క్రీన్ ప్రజన్స్..ఇలా ప్రతీ ఎలిమెంట్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి.
ఈ సినిమాలో ముగ్గరు హీరోయిన్లు ఉన్నా.. ఆడియన్స్ ను మాత్రం సాయి పల్లవి బాగా ఆకట్టుకుంది.
సినిమాలో ప్రతీ సెకండ్.. ప్రతీ ఫ్రేమ్ ను రాహుల్ అద్భుతంగా తెరకెక్కించాడన్నారు. ఇంట్రవెల్ బ్లాక్ మైండ్ బ్లోయింగ్. అదే సినిమాను కొత్త మలుపు తిప్పింది. . స్టోరీ లైన్ గట్టిగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా ఫెస్టివల ఎపిసోడ్ అద్భుతమంటూ ట్వీట్ చేస్తున్నారు. ఈ సినిమా డైరెకర్ రాహుల్ కి ఎక్కువగా ప్రశంసలు వస్తున్నాయి.