వారంలో 4 సార్లు – నరాల బలహీనత,కాళ్ళ నొప్పులు,చేతుల నొప్పులు,కాల్షియం లోపం జీవితంలో ఉండవు
Almond Joint Pains Home Remedies In Telugu : మారిన జీవనశైలి పరిస్థితులు, సరైన పోషకాహారం తీసుకోకపోవటం, ఎక్కువ సేపు కూర్చొని ఉండటం, వ్యాయామం చేయకపోవటం వంటి కారణాలతో ఎన్నో రకాల సమస్యలు ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నారు. ఏదైనా సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
అదే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ సూచనలు పాటిస్తూ ఇప్పుడు చెప్పే పాలను తాగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది. పొయ్యి వెలిగించి ఒక గ్లాస్ పాలను పోసి కొంచెం వేడెక్కాక 8 లేదా 10 ఫుల్ మఖానలను వేయాలి. ఆ తర్వాత 5 బాదం పప్పులను సన్నగా ముక్కలుగా కట్ చేసి వేయాలి.
5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క వేసి ఒక నిమిషం అయ్యాక పొయ్యి ఆఫ్ చేసి గ్లాస్ లో పోసి తాగాలి. ఈ పాలను రాత్రి పడుకోవటానికి ఒక గంట ముందు తీసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో కూడా తీసుకోవచ్చు. ఈ పాలను వారంలో 4 సార్లు తీసుకోవాలి.
ఈ విధంగా నెల రోజుల పాటు తీసుకోవాలి. ఒక వారం త్రాగితేనే మీకు చాలా తేడా కనపడుతుంది. కాళ్ళ నొప్పులు,చేతుల నొప్పులు,నరాల బలహీనత,కాల్షియం లోపం అనేవి ఉండవు. శరీరంలో బలహీనతను తొలగిస్తుంది. అంతేకాకుండా ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి.