ఈ ఫోటోలో ఉన్న స్టార్ నటుడు ఎవరో గుర్తు పట్టారా…?
Tollywood Megastar Chiranjeevi ; నటరత్న ఎన్టీఆర్ రాజకీయాల్లో చేరడం, మెగాస్టార్ చిరంజీవికి స్టార్ డమ్ రావడం ఇంచుమించు ఒకే సమయం. దాంతో స్టార్ హీరోగా 3 దశాబ్ధాలు పాటు తెలుగు తెరను ఏలిన చిరంజీవి సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడు. మెగాస్టార్ అయ్యాడు. చిరంజీవితో సినిమా అంటే హిట్ అనే స్టేజ్ వచ్చేసింది.
అత్యధిక కలెక్షన్స్ రాబడుతున్నారు. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా మెగాస్టార్ చిరంజీవి యాక్టివ్ గానే ఉంటూ తన అభిప్రాయాలను, ఆలోచనలను, తన కొత్త సినిమాలు అప్‌డేట్స్ అందిస్తున్నారు. అలాగే కుటుంబంతో గడపడానికి చిరంజీవి అధిక సమయం వెచ్చిస్తున్నారు. దీంతో తాజాగా ఓ ఆసక్తికర వీడియో నెట్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే పెద్ద కుమార్తె సుస్మిత కూతురికి ‘చూడాలని ఉంది’ స్టోరీ ని చిరంజీవి వివరిస్తున్న వీడియో అది.
చిన్నారి కూడా ఆ కథను ఎంతో ఆసక్తికరంగా వింటోంది. ఈ వీడియోను షూట్ చేసిన సుస్మిత ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆ వీడియో పాతదే అయినప్పటికీ.. ఇప్పుడు నెట్టింట మరోసారి వైరల్ గా మారడంతో కామెంట్స్ పెడుతున్నారు. కాగా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, కాంగ్రెస్ లో విలీనం చేయడం, కేంద్ర మంత్రి కావడం వంటి కారణాల నేపథ్యంలో దాదాపు 9 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సాగిపోయింది.
అయితే వివి వినాయక్ డైరెక్షన్ లో బాస్ ఈజ్ బ్యాక్ టాగ్ లైన్ తో ఖైదీ నెం. 150 మూవీతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నారు. సైరా, ఇప్పుడు ఆచార్య, లూసిఫెర్ రీమేక్ ఇలా తనయుడి రామ్ చరణ్ కంటే వేగంగా వరుస మాస్ సినిమాలు చేస్తూ దూసుకు వెళుతున్నారు.