15 రోజులు-అధిక బరువు,నిద్రలేమి,కిడ్నీలో రాళ్లు ఉండవు…డయాబెటిస్ నియంత్రణ…
Cumin seeds Weight Loss Drink In Telugu : అధిక బరువు సమస్య ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనపడుతుంది. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాం. అయితే వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే చిట్కాను ఫాలో అయితే సరిపోతుంది. అధిక బరువును తగ్గించుకోవటానికి డాక్టర్స్ చుట్టూ తిరిగి ట్రీట్ మెంట్స్ అంటూ వేల కొద్దీ డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.
ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీనిలో 3 ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. అవన్నీ మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే. బరువు తగ్గటానికి ఒక డ్రింక్ తయారుచేసుకుంటున్నాం. ఈ డ్రింక్ తయారీ కూడా చాలా సులువు. చాల ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
ఒక గిన్నెలో గ్లాస్ నీటిని పోసి పొయ్యి మీద పెట్టి కాస్త వేడి అయ్యాక అరస్పూన్ జీలకర్ర వేసి బాగా 5 నిమిషాలు మరిగించాలి. మరిగిన ఈ నీటిని గ్లాస్ లోకి వడకట్టి అరస్పూన్ తేనె, అరచెక్క నిమ్మరసం వేసి తాగాలి. ఈ విధంగా 15 రోజులు తాగి వారం రోజులు గ్యాప్ ఇచ్చి మరల 15 రోజుల పాటు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఈ డ్రింక్ తాగటం వలన కిడ్నీల్లో చేరిన వ్యర్థాలు బయటకు పోవటంతో పాటు కిడ్నీలో రాళ్ళూ చేరవు. డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఈ డ్రింక్ తాగితే తక్షణమే ఉపశమనం కలుగుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు ఈ డ్రింక్ ని రెగ్యులర్ గా రాత్రి పడుకొనే ముందు తాగితే మంచి నిద్ర పడుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులోకి వస్తాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనే వేసుకోకుండా ఈ డ్రింక్ తీసుకోవాలి.