MoviesTollywood news in telugu

రామ్ చరణ్, శంకర్ సినిమాలో సునీల్ కి అవకాశం ఇచ్చింది ఎవరో…?

Sunil New Movie : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తూ, కీలక పాత్ర కూడా పోషిస్తున్నాడు. మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ తో కల్సి ఎస్ ఎస్ రాజమౌళి మల్టీస్టారర్ మూవీగా తీసిన ఆర్ ఆర్ ఆర్ కూడా రిలీజ్ కాబోతోంది.

మరో పక్క రెండు సినిమాలకు రామ్ చరణ్ కమిట్ అయ్యాడు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో ఆర్ సి 15 పేరిట షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తిచేసాడు. వేగంగా సాగిస్తున్న ఈ సినిమాకు సంబంధించి రెండవ షెడ్యూల్ కూడా పూర్తయినట్లు వార్తలొస్తున్నాయి. దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

అయితే ఈ మూవీలో కీలక పాత్ర చేసే ఛాన్స్ దక్కించుకున్న కమెడియన్ సునీల్ మాట్లాడుతూ దిల్ రాజు వలన ఈ ఛాన్స్ వచ్చిందని చెప్పాడు. అయితే గత సినిమాల్లో సునీల్ నటన చూసిన శంకర్ సెలక్ట్ చేసినట్లు సునీల్ చెప్పుకొచ్చాడు. అంజలి, జయరాం తదితరులు నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.