వారంలో 3 సార్లు…అధిక బరువు,రక్తహీనత,డయబెటిస్,గుండె సమస్యలు అనేవి ఉండవు
Green gram Health benefits in telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. అప్పుడే మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి అవసరమైన ఆహారాలలో .పెసలు ఒకటి. పెసలు తినడం వలన మన శరీరానికి ప్రోటీన్స్ బాగా అందుతాయి.
దాంతో కండరాల పనితీరు మెరుగుపడుతుంది. కణజాలం మరమ్మతులకు గురవుతుంది. అలాగే శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. పెసలను మొలకల రూపంలో లేదా ఉడికించుకుని లేదా పెసరట్టు వంటివి చేసుకోవచ్చు. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది శరీరంలో ఉండే కొవ్వును కరిగిస్తుంది.
కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. పెసలు తిన్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. తొందరగా ఆకలి వేయదు. బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. పెసలలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారికి చాలా బాగా సహాయ పడుతుంది.
డయాబెటిస్ ఉన్న వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది..పెసలలో సోడియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది.